ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కించపరిచేలా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నవీన్ కుమార్ గౌడ్ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పలుమార్లు ఏపీ సీఎంతో పాటు పలువురు వైసీపీ నేతలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు అనిల్‌ కుమార్‌ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

 అతడిపై గతంలో వనపర్తి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైనట్లు గుర్తించారు. నిందితుడు నవీన్ కుమార్ గౌడ్‌ ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.