గుంటూరు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ ప్రభుత్వం ఇసుకపై అనుసరిస్తున్న విధానంపై శుక్రవారం టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, రంగబాబు వర్గాలు వేర్వేరుగా నిరసనను నిర్వహించాయి. అన్నా క్యాంటీన్ల వద్ద రంగాబాబు వర్గీయులు.. తహశీల్దార్ కార్యాలయం వద్ద కోడెల వర్గం విడివిడిగా ఆందోళన చేశాయి.

దీంతో నియోజకవర్గంలో ఏం జరుగుతోందోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. కాగా.. శుక్రవారం ఉదయం నుంచి ఇసుక విధానంపై పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ధర్నాలకు దిగగా.. అనుమతి లేదని పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరికొన్ని చోట్ల అరెస్ట్‌లు, హౌస్ అరెస్ట్‌లు నిర్వహించారు.

పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్, ఉద్రిక్తత

టీడీపీ ఆందోళన...దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

ఇసుక ధర 9 రెట్లు ఎందుకు పెరిగింది: జగన్‌పై లోకేశ్ ఫైర్