టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సి పన్ను కెరీర్ విషయంలో కొన్నాళ్ల వరకు చాలా స్ట్రగుల్ అయ్యింది. మొత్తానికి బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటుంది. తెలుగులో వరుస అపజయాలతో సతమతమయినప్పటికీ బేబీ ఇప్పుడు హిందీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలనే కాకుండా మంచి కాన్సెప్ట్ ఉన్న ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటిస్తోంది. మొన్న సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన గేమ్ ఓవర్ సినిమాను తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేసిన తాప్సి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సొట్టబుగ్గల సుందరి ఒక బయోపిక్ తో రెడీ అవుతోంది. 

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతానికి చెందిన రష్మీ అనే అథ్లెటిక్ అమ్మాయి జీవిత ఆధారంగా దర్శకుడు ఆకర్ష్ ఖురానా 'రష్మీ రాకెట్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అందులో తాప్సి రష్మిగా టైటిల్ లో రోల్ లో కనిపించనుంది. సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.