బిగ్ బాస్ షోలో బుధవారం నాడు మొదలైన ట్రైన్ టాస్క్ రెండో రోజు కూడా కొనసాగింది. బిగ్ బాస్ ‘ఎక్స్ ప్రెస్’ అంటూ బిగ్ బాస్ హౌస్‌లో ఉంచిన బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్‌లో ఇండియాలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ మధ్యలో హౌస్ మేట్స్ తో టాస్క్ లు చేయిస్తూ ప్రేక్షకులను విసిగించేశారు.

ఇక గురువారం  నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి కంటెస్టెంట్స్‌కి ‘స్టార్, కెమెరా, యాక్షన్’ అనే టాస్క్ ఇచ్చారు. ఐదు నిమిషాల నిడివితో ఉండే ఈ వీడియోలో లవ్, రొమాన్స్, యాక్షన్ ఎమోషన్స్ ఉండాలని చెప్పారు.  

ఈ టాస్క్‌లో బాబా భాస్కర్ దర్శకుడు కాగా.. కెమెరామెన్‌గా వరుణ్, అసిస్టెంట్‌గా రాహుల్.. నటీనటులుగా శ్రీముఖి, హిమజ, రవి, అలీ, మహేష్ తమ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వీళ్ల యాక్షన్‌తో ఆడియన్స్ కి చిరాకు పుట్టించారు. వీరి పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని.. మీలో ఎవరు బాగా పెర్ఫామ్ చేశారో మీరే నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ ఛాయిస్ ఇచ్చారు.

‘ఛలో ఇండియా టాస్క్’లో బాబా భాస్కర్, రాహుల్, వరుణ్‌లను బెస్ట్ పెర్ఫామెన్స్‌గా ఎన్నుకున్నారు కంటెస్టెంట్స్. దీంతో ఈ ముగ్గురు సభ్యులు ఈవారం హౌస్‌కి కెప్టెన్ అయ్యే పోటీదారులుగా ప్రకటించారు బిగ్ బాస్. మరి కెప్టెన్ అయ్యేది ఎవరో శుక్రవారం నాటి ఎపిసోడ్ లో తెలుస్తుంది!