టీడీపికి గండం: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 9, 2019, 6:26 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

టీడీపికి బిగ్ షాక్: ముగ్గురు ఎమ్మెల్యేలకు పదవీ గండం?

వరుస సంక్షోభాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కుదేలైన తెలుగుదేశం పార్టీని అనర్హత వేటు అంటూ వైసీపీ కోర్టులను ఆశ్రయించడం ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. 

 

ఈ హీరోయిన్ల సీన్ అయిపోయినట్లేనా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్ల హాట్ ఫోటోల హంగామా బాగా ఎక్కువైంది. వారిలో ప్రగ్యాజైస్వాల్, లావణ్య త్రిపాఠిల ఫోటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్కిన్ షోకి నో చెప్పిన లావణ్య త్రిపాఠి సైతం సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఫోటో షూట్లలో గ్లామర్ షో ఒలకబోస్తోంది.

 

'బిగ్ బాస్ 3': రెమ్యునరేషన్ లో ఎన్టీఆర్ ని మించిపోయిన నాగ్!

మార్కెట్ పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ కి ఉన్నంత క్రేజ్ నాగార్జునకి లేదనే చెప్పాలి. ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్, రెమ్యునరేషన్ ఇలా ఏ విషయంలోనైనా నాగ్ తేలిపోతాడు. కానీ బుల్లితెరకి వచ్చేసరికి ఎన్టీఆర్ ని నాగార్జున బీట్ చేయడం విశేషం.

 

పవన్ ను కాదని మీకు ఓటేశాం: జగన్ కు ముద్రగడ లేఖ

2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని తమ కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. పరోక్షంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఆయన ప్రస్తావించారు.

 

పాలించడానికి మాటలు కాదు బుద్ధిబలం ఉండాలి, మా లోకేష్ కు బోలెడు ఉంది: వైసీపీపై దివ్యవాణి విసుర్లు

లోకేష్ ను ట్విట్టర్ పిట్ట అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యవాణి. మాట్లాడే వాడే నాయకుడు కాదని బుద్ధిబలం ఉన్నవాడే నాయకుడన్నారు. పరిపాలించడానికి కావాల్సింది బుద్ధిబలమేనన్నారు. ఆ బుద్ధిబలం నారా లోకేష్ దగ్గర చాలా ఉందన్నారు.   
 

 

నేను చేసిన తప్పు అదేనా: జగన్ సర్కార్‌పై చంద్రబాబు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ని వీరాపురంలోజరిగిన  టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.రాత్రి, పగలు తేడా లేకుండా అభివృద్ది పనులు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. నీతి , నిజాయితీగా తన పాలన కొనసాగించినట్టుగా ఆయన ప్రస్తావించారు.
 

 

చంద్రబాబుకి షాక్.. బీజేపీలోకి సీనియర్ నేత

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కి ఊహించని షాక్ తగిలింది. మరో సీనియర్ నేత టీడీపీని వీడీ బీజేపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు మంగళవారం బీజేపీలో చేరారు. 

 

 

వైసీపీలో ఫ్లెక్సీ చిచ్చు: కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులు, కేసు నమోదు

గుంటూరు జిల్లాలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా విబేధాలు నెలకొన్నాయి. తాడికొండ నియోజకవర్గంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

 

ఇచ్చిన మాట తప్పిన జగన్, అది మోసమే : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు.  ఉద్యోగులకు గత ప్రభుత్వం 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 27 శాతం మధ్యంతరభృతి ఇస్తామని వైయస్ జగన్ చెప్పారని గుర్తు చఏశారు. 
 

 

ఆ మూడు పదాలు పలకగలవా..? లోకేష్ కి వైసీపీ ఎమ్మెల్యే ఛాలెంజ్

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ కి వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సవాలు విసిరారు. తమ సీఎం జగన్ పాలన చూసి లోకేష్, జగన్ లు భయపడుతున్నారని చెప్పారు. టీడీపీ వైఫల్యాలన్నింటినీ తమపైకి తోసేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిజాలను అంగీకరించకుండా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
 

 

చంద్రబాబు భద్రతపై పిటిషన్: విచారణ బుధవారానికి వాయిదా

అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు భద్రత కుదింపుకు సంబంధించిన పిటిషన్‌పై  విచారణను బుధవారానికి  హైకోర్టు వాయిదా వేసింది. తన భద్రత కుదింపును పున:సమీక్షించాలంటూ చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై  మంగళవారం నాడు వాదనలు జరిగాయి. ఈ విషయమై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
 

 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే వంశీ భేటీ లోగుట్టు ఇదే.....

తెలుగుదేశం పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నానని త్వరలోనే బీజేపీలోనే చేరుతున్నట్లు వస్తున్న వార్తలను వంశీ ఖండించారు. 
 

 

సచివాలయానికి జగన్ దూరం: కారణమిదే

ఏపీ సీఎం వైఎస్ జగన్  సచివాలయానికి  తక్కువగా వెళ్తున్నారు. అయితే దీనికి కూడ ఓ కారణం ఉందని సమాచారం. సచివాలయంలోనే పలు శాఖ సమీక్షలు నిర్వహించనున్నట్టు జగన్ షెడ్యూల్‌లో ఉంటుంది. కానీ, చివరి నిమిషంలో ఈ కార్యక్రమాలు రద్దౌతున్నాయి. సమీక్షలను మాత్రం జగన్ క్యాంపు కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. 
 

 

జగన్ పథకాలు...కండిషన్స్ అప్లయ్: లోకేశ్ సెటైర్లు

అమ్మ ఒడి పథకంపై ముఖ్యమంత్రి ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యరంలో ఆయన గోదావరి జలాలకు హారతి ఇచ్చారు.
 

 

మందుబాబులకు షాక్... సాయంత్రం 6 తర్వాత నో మందు

మందు బాబులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.  మద్యపాన వినియోగాన్ని అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా సాయంత్రం ఆరు తర్వాత మద్యం దొరకకుండా ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం  రాష్ట్రంలో ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. 
 

 

అచ్చెన్నాయుడికి షాక్.. ఆయన ఎన్నిక రద్దు చేయాలని...

ఏపీలో టీడీపీకి  షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమిపాలై షాక్ లో ఉండగా... గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేల పదువులు కూడా చేరజారిపోయేలా కనపడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నిక రద్దు  చేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
 

 

విషయం ఉన్నోళ్లు కావాలి.. షో చేసే వాళ్లు కాదు: టీడీపీపై కేశినేని ట్వీట్

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి సొంత పార్టీపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి ట్వీట్టర్‌లో సెటైర్లు వేశారు. ‘‘ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కావాల్సింది విషయం ఉన్నోళ్లు కాని.. షో చేసే వాళ్లు కాదంటూ సెటైర్లు వేశారు.
 

 

కేకలు వేశారు, రాం మాధవ్ ను అవమానించలేదు: తానా

తాము బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను అవమానించలేదని తానా అధ్యక్షుడు వేమన సతీష్, సభల సమన్వయ కర్త డాక్టర్ మూల్పూరి వెంకటరావు స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన తమ సభల్లో రామ్ మాధవ్ ను అవనమానించినట్లు వార్తల్లో నిజం లేదని వారు స్పష్టం చేశారు.
 

 

ఇంట్లోనే వ్యభిచారం, ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

నెల్లూరులో వృభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే...నగరంలోని వేదాయపాళెంలోని వ్యభిచారం జరుగుతుందోని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆయా నివాసాలపై నిఘా పెట్టిన పోలీసులు సోమవారం సాయంత్ర దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
 

 

రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం భారీ స్కెచ్

 ప్రముఖ వ్యాపార వేత్త రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం ఆరు మాసాలుగా స్కెచ్ వేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాంప్రసాద్ హత్య కేసులో  సోమవారం రాత్రి  కోగంటి సత్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.రాంప్రసాద్ హత్యకు దారి తీసిన పరిస్థితులను పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

 

కేసీఆర్‌కు షాక్: టీఆర్ఎస్‌కు సోమారపు సత్యనారాయణ రాజీనామా

మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో గోదావరిఖని నుండి సోమారపు సత్యనారాయణ  టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ఈ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి చందర్ విజయం సాధించాడు. ఆ తర్వాత చందర్  టీఆర్ఎస్‌లో చేరారు.
 

 

రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం భారీ స్కెచ్

ప్రముఖ వ్యాపార వేత్త రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం ఆరు మాసాలుగా స్కెచ్ వేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాంప్రసాద్ హత్య కేసులో  సోమవారం రాత్రి  కోగంటి సత్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.రాంప్రసాద్ హత్యకు దారి తీసిన పరిస్థితులను పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

 

రాంప్రసాద్ హత్య: తెరపైకి ఖమ్మం భూములు, కోగంటికి ఉచ్చు

పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విచారణలో భాగంగా కోగంటి బెదిరింపులకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
 

 

నెగెటివ్ రివ్యూలు ఇస్తే లీగల్ యాక్షన్.. ఇదెక్కడి రూల్..?

కోలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పేరుతో వచ్చిన ఓ ప్రెస్ నోట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ఇకపై సినిమా రివ్యూలు రాసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని.. సినిమాను దుయ్యబడుతూ, తీవ్రంగా విమర్శిస్తూ ఎవరైనా అభిప్రాయాలు చెబితే వాళ్ల మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని  ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
 

 

సినిమాలకు మెగా హీరోయిన్ గుడ్ బై.. నాగబాబుకు చెప్పిన నిహారిక ?

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. నాగబాబు కుమార్తెగా ఆమె ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా మారారు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా వెనకడుగు వేయకుండా హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు కూడా నిరాశపరచడంతో నిహారిక ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని భావిస్తోందట. 
 

 

పొట్టి బట్టలు వేసుకొని, సెక్స్ ప్రయారిటీ అంటావ్.. సమంతపై ట్రోల్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతని నెటిజన్లు టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆమెపై మీమ్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా ఒక అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు ఒకరినొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ప్రేమ ఉండదనేదితన అభిప్రాయమని చెప్పాడు.
 

 

నాకు నచ్చినట్లు ఉంటా.. నెగిటివ్ కామెంట్స్ కు నిత్య కౌంటర్

ఫరెంట్ క్యారెక్టర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నిత్యా మీనన్. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా కేవలం తనకు సెట్టయ్యే కథలనే ఎంచుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోని నిత్యా రీసెంట్ గా కొన్ని కామెంట్స్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 
 

 

పెళ్లయిన కొన్నాళ్లకే దుర్మరణం.. యాక్టర్ ఇంట్లో విషాదం

బాలీవుడ్ సీరియల్ నటుడు ప్రిన్స్ నరులా ఇటీవల చెప్పిన ఒక విషాదకరమైన సంఘటన అందరిని షాక్ కి గురి చేసింది. అతని తమ్ముడి దుర్మరణం బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. నవ్వుతూ కళ్ళముందు పెరిగిన తమ్ముడు ఇప్పుడు లేకపోవడం ఎంతో ఆవేదనని కలిగిస్తోందని నాగిన్ 3 ఫెమ్ ప్రిన్స్ చెప్పడం భావోద్వేగానికి లోను చేస్తోంది. 
 

 

హెజా టీజర్: భయపెడుతున్న ముమైత్ - నూతన నాయుడు

హారర్ కాన్సెప్ట్ తో వచ్చే చిత్రాలకు ఓ వర్గం ప్రేక్షకుల నుంచి స్పెషల్ సపోర్ట్  ఎప్పుడు ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నా కొన్ని హారర్ కథలు రెగ్యులర్ గా ఉండడంతో అంతగా క్లిక్కవడం లేదు. అయితే ఒక స్పెషల్ విజువల్స్ తో  ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తున్న హారర్ టీజర్ హెజా.

 


 


 

 

click me!