మార్కెట్ పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ కి ఉన్నంత క్రేజ్ నాగార్జునకి లేదనే చెప్పాలి. ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్, రెమ్యునరేషన్ ఇలా ఏ విషయంలోనైనా నాగ్ తేలిపోతాడు. కానీ బుల్లితెరకి వచ్చేసరికి ఎన్టీఆర్ ని నాగార్జున బీట్ చేయడం విశేషం.

'బిగ్ బాస్' తొలి సీజన్ కోసం ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికంతో పోలిస్తే నాగ్ డబుల్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడనే చెప్పాలి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ లో హోస్ట్ చేస్తున్నందుకు నాగార్జున ఏకంగా రూ.12 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట.

బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ చేయడానికి నిర్వాహకులు చాలా మంది హీరోలను సంప్రదించారు. కానీ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నాగ్ ని బలవంతంగా ఈ షో కోసం ఒప్పించారు. నాగ్ ని తీసుకురావడం కోసం అతడికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ తో పోలిస్తే.. ఇప్పుడు బిగ్ బాస్ కి క్రేజ్ పెరగడంతో నిర్వాహకులు కూడా నాగ్ కి అత్యధిక పారితోషికం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 

గతేడాది సీజన్ 2 కోసం నాని తీసుకున్న రెమ్యునరేషన్ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. తొలి సీజన్ సమయంలో ఎన్టీఆర్ కి ఆరేడు కోట్ల రేమ్యునరేషన్ మాత్రమే అందింది. మొత్తానికి నాగ్ రెమ్యునరేషన్ విషయంలో అయితే ఎన్టీఆర్ ని బీట్ చేసేశాడు.