టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతని నెటిజన్లు టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆమెపై మీమ్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా ఒక అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు ఒకరినొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ప్రేమ ఉండదనేది
తన అభిప్రాయమని చెప్పాడు.

ఈ కామెంట్లు దుమారాన్ని రేపాయి. చాలా మంది సెలబ్రిటీలు సందీప్ పై విరుచుకుపడ్డారు. సమంత కూడా సందీప్ మాటలను తప్పుబట్టింది. దీంతో కొందరు నెటిజన్లు సమంతని తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

'రంగస్థలం' సినిమాలో హీరో రామ్ చరణ్.. సమంతను కొట్టే సీన్ స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అలానే ఓ ఇంటర్వ్యూలో సమంతను 'ఫుడ్ లేదా సెక్స్ దేనికి ప్రయారిటీ ఇస్తారు..?' అని ప్రశ్నిస్తే.. దానికి ఆమె సెక్స్ అని సమాధానమిచ్చింది. ఇప్పుడు ఆ పాయింట్ పట్టుకొని పబ్లిక్ గా సెక్స్ కే ప్రాధాన్యత అని నువ్ చెప్పినప్పుడు తప్పు లేదు కానీ సందీప్ రెడ్డి తన అభిప్రాయాన్ని చెబితే తప్పా..? అంటూ సమంతపై  విరుచుకుపడుతున్నారు.

కొందరైతే 'ఓ బేబీ' ప్రీరిలీజ్ ఈవెంట్ లో సమంత వేసుకున్న డ్రెస్ ని విమర్శిస్తూ పెళ్లైన అమ్మాయివి ఇలాంటి పొట్టి బట్టలు వేసుకుంటూ నీకు నచ్చినట్లుగా నువ్ ఉంటున్నావ్..?  అలానే మరొకరు తన అభిప్రాయాన్ని చెప్పడంతో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!