అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు భద్రత కుదింపుకు సంబంధించిన పిటిషన్‌పై  విచారణను బుధవారానికి  హైకోర్టు వాయిదా వేసింది. 

తన భద్రత కుదింపును పున:సమీక్షించాలంటూ చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై  మంగళవారం నాడు వాదనలు జరిగాయి. ఈ విషయమై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 2004 నుండి  2014 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో  చంద్రబాబుకు ఒక ఎఎస్పీ, ఒక డిఎస్పీ స్థాయి అధికారులు సీఎస్ఓలుగా పనిచేశారు.  వీరి కింద ముగ్గురు ఆర్ఐలు ఉండేవారు. వీరి పరిధిలో ఒక హెడ్‌ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించేవారు.

ఇప్పుడు మాత్రం ఒక డిఎస్పీతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రతా సిబ్బందిగా ప్రభుత్వం కేటాయించింది. భద్రతను ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వం కుదించిందని  టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు.