గుంటూరు: గుంటూరు జిల్లాలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా విబేధాలు నెలకొన్నాయి. తాడికొండ నియోజకవర్గంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. 

ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి తన ఫోటో పెద్దదిగా వేయించుకుని ఎంపీ నందిగం సురేష్ చిన్నగా వేయించారు. ఎంపీ ఫోటో చిన్నగా వేయిస్తారా అంటూ ఆయన అనుచరులు ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులతో వాగ్వాదానికి దిగారు. 

దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. అనంతరం ఇరువురు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు పోలీసులను ఆశ్రయించారు. ఎంపీ నందిగం సురేష్ అనుచరులపై ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గొడవలు కేసులు దాకా పోవడంతో జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.