అమ్మ ఒడి పథకంపై ముఖ్యమంత్రి ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యరంలో ఆయన గోదావరి జలాలకు హారతి ఇచ్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు దినోత్సవాన్ని ఘనంగా జరిపిన వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో ఇంతవరకు రైతులకు విత్తనాలు అందలేదని లోకేశ్ ఆరోపించారు.

2014కు ముందున్న పరిస్ధితి మరోసారి రాష్ట్రంలో కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రూ.3 వేల రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దానిని దాటవేస్తున్నారని ఎద్దేవా చేశారు.

విత్తనాలు, ఎరువులు ఎందుకు ఆలస్యమవుతున్నాయంటే.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాకా.. 120 పథకాలు సందిగ్ధంలో పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.