డిఫరెంట్ క్యారెక్టర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నిత్యా మీనన్. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా కేవలం తనకు సెట్టయ్యే కథలనే ఎంచుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోని నిత్యా రీసెంట్ గా కొన్ని కామెంట్స్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 

గతంతో పోలిస్తే నిత్యా మీనన్ ఫిట్ నెస్ లో అలసత్వం కనిపిస్తోందని బొద్దుగా మారడంపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే అమ్మడు రీసెంట్ గా ఒక స్పెషల్ పిక్ తోనే ఆన్సర్ ఇచ్చింది;. గ్లామర్ డ్రెస్ లో కాస్త హాట్ గా కనిపించిన నిత్యా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని మరో స్టేట్మెంట్ ఇచ్చింది. 

అభిమానులు నటీనటులను ఏ విధంగా చూసినా తమ వ్యక్తిగత జీవితం సాధారణ మహిళలు ఉన్నట్లే ఉంటుందని చెప్పింది. ఒంటరిగా ఉంటే నేను కూడా సాధారణ అమ్మాయిలనే ఉంటానని అంటూ..విమర్శలు గత ఏడాది నుంచి కాస్త చిరాగ్గా అనిపించాయని తన ఫిట్ నెస్ అనేది తన ఇష్టమని చెప్పింది. ఏదేమైనా నిత్యా నెగిటివ్ కామెంట్స్ కి ఫొటోతో అలాగే మాటతో మొదటిసారి సారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది.