సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి సొంత పార్టీపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి ట్వీట్టర్‌లో సెటైర్లు వేశారు. ‘‘ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కావాల్సింది విషయం ఉన్నోళ్లు కాని.. షో చేసే వాళ్లు కాదంటూ సెటైర్లు వేశారు.

కాగా లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకటించిన పార్లమెంటరీ పార్టీ పదవులపై అసంతృప్తి వ్యక్తం చేసిన నాని.. చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు. అలాగే పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వెరైటీగా స్పందించారు. చంద్రబాబు వైసీపీలోకి వెళితే... తాను బీజేపీలో చేరుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.