ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్ల హాట్ ఫోటోల హంగామా బాగా ఎక్కువైంది. వారిలో ప్రగ్యాజైస్వాల్, లావణ్య త్రిపాఠిల ఫోటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్కిన్ షోకి నో చెప్పిన లావణ్య త్రిపాఠి సైతం సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఫోటో షూట్లలో గ్లామర్ షో ఒలకబోస్తోంది.

'కంచె' సినిమాతో పాపులారిటీ దక్కించుకున్న ప్రగ్య సరైన అవకాశాలను అందుకోలేకపోయింది. చిన్న చిన్న సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినప్పటికీ అవేవీ ఆమెకి సక్సెస్ ని తీసుకురాలేకపోయాయి. ఆమె చివరిగా నటించిన 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' వంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ లుగా మిగిలాయి.

మరోపక్క లావణ్య త్రిపాఠి పరిస్థితి ఇంతకంటే దారుణంగా తయారైంది. 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కొన్ని హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ డమ్ ని దక్కించుకోలేకపోయింది. ఇండస్ట్రీ కూడా మెల్లగా ఆమెని మర్చిపోయింది. స్టార్ హీరోల సంగతి తరువాత కనీసం కుర్ర హీరోలు కూడా ఆమె వంక చూడడం లేదు.

ప్రస్తుతం నిఖిల్ తో చేసిన 'అర్జున్ సురవరం' మాత్రమే ఆమె చేతిలో ఉంది. కానీ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. హెబ్బాపటేల్, ప్రణీత ఇలా చాలా మంది హీరోయిన్లకు అవకాశాలు లేక ఫోటోషూట్లలో పాల్గొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాలం గడుపుతున్నారు.