Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడికి షాక్.. ఆయన ఎన్నిక రద్దు చేయాలని...

ఏపీలో టీడీపీకి  షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమిపాలై షాక్ లో ఉండగా... గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేల పదువులు కూడా చేరజారిపోయేలా కనపడుతున్నాయి.

shock waits to MLA achanna naidu over his victory
Author
Hyderabad, First Published Jul 9, 2019, 10:46 AM IST

ఏపీలో టీడీపీకి  షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమిపాలై షాక్ లో ఉండగా... గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేల పదువులు కూడా చేరజారిపోయేలా కనపడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నిక రద్దు  చేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.

ఏపీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున కింజరాపు అచ్చెన్నాయుడు విజయం సాధించారు. అయితే, ఆయన నామినేషన్ సమయంలో తనపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను అఫిడ్‌విట్‌లో వెల్లడించలేదంటూ వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. 

జులై 21, 2017లో అచ్చెన్నాయుడిపై అనంతపురం జిల్లా హీరేహళ్‌లో కేసు నమోదయ్యిందని, అందులో ఆయన 21 నిందితుడిగా ఉన్నారని తిలక్ తన పిటిషన్‌లో పేర్కన్నారు. ఈ కేసు వివరాల్ని ఎన్నికల నామినేషన్‌ ప్రమాణ పత్రంలో వెల్లడించకుండా అచ్చెన్నాయుడు దాచిపెట్టారన్నారు. 

ఆ కేసులో రాయదుర్గం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని తెలిపారు. ఆ తర్వాత ఈ కేసు ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యిందని, నామినేషన్‌ వేసే సమయానికి ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నారు. కేవలం టెక్కలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్‌ కేసును మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే అఫిడ్‌విట్‌లో ప్రస్తావించారు.

ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని అచ్చెన్నాయుడు ఎన్నికను రద్దు చేయాలని, టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని తిలక్ తన వ్యాజ్యంలో కోరారు. మరి ఈ విషయంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios