తమిళిసైపై కేసీఆర్ కినుక : మరిన్ని వార్తలు

By Siva KodatiFirst Published Sep 9, 2019, 12:50 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

తమిళిసైపై కేసీఆర్ కినుక: తేటతెల్లం చేసిన సీపిఆర్వో జ్వాలా వ్యాసం

గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ దుర్వినియోగం చేయడంపై సర్కారియా కమిషన్ సిఫార్సులను ఎత్తి చూపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిపీఆర్వో జ్వాలా నరసింహారావు వనం రాసిన వ్యాసం చర్చనీయాంశంగా మారింది. తమిళిసై పేరెత్తకుండా ఆ వ్యాసం రాసినప్పటికీ, తెలంగాణ గవర్నర్ గా ఆమె నియామకం జరిగిన నేపథ్యంలో ఆ వ్యాసం రావడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

కేసీఆర్ కు భయం, అందుకే కేబినెట్ లోకి ఇద్దరు మహిళలు: మాజీ మంత్రి డీకే అరుణ

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసేంది కేవలం బీజేపీ మాత్రమేనని డీకే అరుణ స్పష్ఠం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముసలం పుట్టిందని విమర్శించారు. టీఆర్ఎస్ లో ఓనర్ల ఇష్యూ నడుస్తోందని విమర్శించారు. ఈ ఓనర్ల గొడవ ఇక్కడితో ఆగిపోదని త్వరలోనే పెద్ద ప్రమాదంగా పరిగణించబోతుందని తెలిపారు. 

శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి: ఎన్నిక లాంఛనమే....

గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది. ఇకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ ను ఏడుగురు శాసన మండలి సభ్యులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇకపోతే 11 ఉదయం 11.30 గంటలకు శాసన మండలి సమావేశమై గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసన మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డిప్యూటీ చైర్మన్ మండలిలో ప్రకటించనున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 

కేసీఆర్ సమర్థవంతమైన సీఎం, అన్నింటా తెలంగాణ నంబర్ వన్: గవర్నర్ సౌందరరాజన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోబోతుందంటూ స్పష్టం చేశారు. 

పెయిడ్ ఆర్టిస్టులతో గొడవలు: మంత్రి సుచరిత

కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో గొడవలు చేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత విమర్శించారు.

 

యురేనియం తవ్వకాలు తెలుగు రాష్ట్రాలకు ముప్పు: జనసేనాని పవన్ కళ్యాణ్

యురేనియం తవ్వకాల వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతాయని తెలిపారు. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.రేడియేషన్‌తో మహిళల్లో గర్భసంచి సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. ఈ విషయం చాలా మంది జనసేన పార్టీ దృషికి తీసుకు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 

అధికవేగానికి నేనూ చలానా కట్టా: న్యూ మోటార్ వెహికల్ యాక్ట్ ని సమర్థించిన నితిన్ గడ్కరీ

ఈ చట్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన యాక్ట్ ప్రకారం విధించే జరిమానాలను నితిన్ గడ్కరీ సమర్థించారు. ప్రధాని నరేంద్ర మోదీ 100 రోజుల పాలనపై ముంబైలో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధిక వేగం కారణంగా ముంబైలో తన వాహనం కూడా జరిమానాకు గురైందని చెప్పుకొచ్చారు. తాను కూడా ఆ జరిమానాను చెల్లించినట్టు తెలిపారు. 

జగన్ సరికొత్త ప్లాన్: గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు నిర్ణయం

గ్రామ సచివాలయాల్లో ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల నుంచి నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, యంత్రాంగం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఉండాలని జగన్ ఆదేశించారు. అలాగే గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారాన్ని మహిళ సంక్షేమంలో తీసుకోవాలని సూచించారు. 

పీపీఏలపై తప్పుడు ప్రచారం, మేం చెప్పినా వినడం లేదు: జగన్ పై కేంద్రమంత్రి ఆగ్రహం

 పీపీఏల విషయంలో సీఎం జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. అవకతవకలు జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, సరైన ఆధారాలు లేకుండా పీపీఏలను రద్దు చేయాలని కోరుతున్నారంటూ మండిపడ్డారు. సరైన ఆధారాలుంటే విద్యుత్ రంగంలో పెట్టుబడులు వస్తాయని, తాము చెప్పినా జగన్ వినడం లేదంటూ కేంద్రమంత్రి మండిపడ్డారు. 

ఈ నెల 22వరకు తెలంగాణ అసెంబ్లీ: బీఎసీ నిర్ణయం

 

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

 మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన మాట తప్పారని ఆయన మండిపడ్డారు. గత టర్మ్‌లో నాయిని నర్సింహరెడ్డి హోం మంత్రిగా కొనసాగారు. ఈ దఫా నాయిని నర్సింహరెడ్డికి కేసీఆర్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో నాయిని నర్సింహరెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

 

ఈ నెల 22వ తేదీవరకు అసెంబ్లీ నిర్వహించాలని   సోమవారం నాడు నిర్వహించిన బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడిన  వెంటనే బీఎసీ సమావేశమైంది.

 

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

 తెలంగాణ బీఎసీ నుండి మంత్రి ఈటల రాజేందర్ ను తప్పించారు. ఈటల రాజేందర్ స్థానంలో గంగుల కమలాకర్ ను నియమించారు. గంగుల కమలాకర్ ఆదివారం నాడు మంత్రిగా ప్రమాణం చేశారు.

 

అలాగైతేనే...: ఉత్తమ్, కుంతియాలపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాజీనామా చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

మరో కుట్రకు పాక్ ప్లాన్... మసూద్ అజార్ విడుదల

భారత్ పై మరో ఉగ్రదాడికి పాక్ ప్లాన్ చేస్తోందా..? అవుననే అనుమానాలే కలుగుతున్నాయి. భారత్ పై దాడిచేసేందుకు పాక్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే..

కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా గల్లంతు: అసెంబ్లీలో ముందు సీట్లలోకి మజ్లిస్

తెలంగాణ అసెంబ్లీలో వివిధ పార్టీలకు కేటాయించిన సీట్ల స్థానాలు మారిపోయాయి. సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోవడంతో ఎంఐఎం సభ్యులకు ముందు వరుస సీట్లు కేటాయించారు. రెండో వరుసలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సీటు ఇచ్చారు.

 

రూ.1,46,492 కోట్లతో తెలంగాణ బడ్జెట్: ఆర్ధిక లోటు రూ. 24,081.74 కోట్లు

 తెలంగాణ రాష్ట్రం 2019-20 బడ్జెట్ 1 లక్ష 46వేల 492 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది వాస్తవ అంచనాలతో బడ్జెట్ ను ప్రవశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో 1లక్షా82వేల017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

 

తెలంగాణ బడ్జెట్ : రైతుబందు పథకానికి రూ. 12 వేల కోట్లు

ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు వీలుగా తెలంగాణ సర్కార్ బడ్జెట్ లో నిధులను కేటాయించింది. రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల ముందు రైతులకు పెట్టుబడి సాయం కింద నిధులను ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హమీ టీఆర్ఎస్ కు ఓట్లను కురిపించింది.

 

తెలంగాణ బడ్జెట్: ఆర్థిక పరిస్థితి ఇదీ...

గతంలో ప్రవేశపెట్టిన  రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్  లో  ఇవాళ సమర్పించిన అంచనాలకు  చాలా వ్యత్యాసం ఉంది.తెలంగాణ రాష్ట్రంలో అంచనా వేసిన ఆదాయం  రాకుండా తగ్గిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్ధిక మాంధ్యం ప్రభావం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన ప్రకటించారు.

 

చంద్రబాబుకు పవన్ రాజకీయ బినామీ: బొత్స సంచలనం

టీడీపీ చీఫ్ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్  రాజకీయ బినామీ అని ఏపీ పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కారణంగానే టీడీపీ వాయిస్‌ను పవన్ కళ్యాణ్ విన్పిస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

 

తెలంగాణ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పోందిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూపొందించింది.

 

భారత్ చేతిలో వైట్‌వాష్: ప్రక్షాళన దిశగా విండీస్ బోర్డ్, కెప్టెన్‌గా పొలార్డ్..?

వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్ జట్టు సారధిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌తో పాటు భారత్‌తో జరిగిన సిరీస్‌లో విండీస్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టు కెప్టెన్లను మార్చాలని నిర్ణయించింది

 

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

బిజెపి నుంచి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించే కేసీఆర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావుకు చోటు కల్పించడం, ఈటల రాజేందర్ ను కొనసాగించడం, కడియం శ్రీహరి వంటి నేతలకు పదవులు ఇస్తానని ప్రకటించడం అందులో భాగమేనని అంటున్నారు.

 

తాట తీస్తోన్న కొత్త చట్టం: ట్రక్కు డ్రైవర్‌కు రూ.86 వేల జరిమానా

కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం వాహనదారులను బేంబేలిత్తిస్తోంది. ఇప్పటికే నిబంధనలను అతిక్రమించిన వారికి వేలకు వేలు ఫైన్లు పడుతున్నాయి. తాజాగా ఒడిషాలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు రూ.86,500 జరిమానా విధించడం సంచలనం సృష్టించింది.

 

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

తన మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో పునర్వ్యీస్థీకరించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆరుగురు కొత్త వారికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరి ప్రమాణ స్వీకారం ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగింది. ఇందులో అందరి దృష్టి.. టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు పైనే ఉంది

 

ఉత్కంఠకు తెర: ఆర్టికల్ 371 జోలికి వెళ్లమన్న అమిత్ షా

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో .. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 371 సైతం రద్దు చేస్తారని వస్తున్న వార్తలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. తాము ఎట్టిపరిస్ధితుల్లో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని షా స్పష్టం చేశారు.

 

ఒకే చోట 90 కుక్కల మృతదేహాలు... తాళ్లతో కాళ్లు కట్టేసి

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒకే చోట 90 వీధి కుక్కల మృతదేహాలు కనిపించడంతో కలకలం రేగింది. కుక్కలను కాళ్లను తీగలతో కట్టేసి ఉంచడం ప్రజల్లో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది

 

నేడే తెలంగాణ బడ్జెట్: నిధుల్లో కోతలు తప్పవా?

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను సోమవారం నాడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

 

click me!