Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బడ్జెట్ : రైతుబందు పథకానికి రూ. 12 వేల కోట్లు

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి ఎక్కువ నిధులను కేటాయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు వీలుగా బడ్జెట్ లో నిధులను కేటాయించింది సర్కార్.

telangana government allocates Rs 12000 crores for rythu bandhu scheme
Author
Hyderabad, First Published Sep 9, 2019, 12:17 PM IST


హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు వీలుగా తెలంగాణ సర్కార్ బడ్జెట్ లో నిధులను కేటాయించింది. రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల ముందు రైతులకు పెట్టుబడి సాయం కింద నిధులను ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హమీ టీఆర్ఎస్ కు ఓట్లను కురిపించింది.

సోమవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్  2019-20అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడ ఆదర్శంగా తీసుకొన్నాయి. కేంద్రం కూడ ఇదే తరహలో పథకాన్ని ప్రవేశపెట్టింది.

రైతు బంధు పథకానికి ఈ బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లను కేటాయించింది. మరో వైపు రైతు భీమా కోసం కూడ ప్రభుత్వం రూ. 1137 కోట్లను కేటాయించింది. పంటల రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లను కేటాయించింది. 

పంట రుణాలు తీసుకొన్న రైతులకు లక్ష రూపాయాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.  లక్ష రూపాయాల రుణాలను తీసుకొన్న రైతులకు రుణాలను మాఫీ చేస్తున్నారు. అయితే రుణాల మాఫీల విషయంలో ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు రైతులకు ప్రయోజనంగా లేవని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.మరో వైపు ఆసరా పెన్షన్ల కోసం రూ. 9402 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

సంబంధిత వార్తలు

తెలంగాణ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు
రూ.1,46,492 కోట్లతో తెలంగాణ బడ్జెట్: ఆర్ధిక లోటు రూ. 24,081.74 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios