హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. పీపీఏల విషయంలో సీఎం జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. 

అవకతవకలు జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, సరైన ఆధారాలు లేకుండా పీపీఏలను రద్దు చేయాలని కోరుతున్నారంటూ మండిపడ్డారు. సరైన ఆధారాలుంటే విద్యుత్ రంగంలో పెట్టుబడులు వస్తాయని, తాము చెప్పినా జగన్ వినడం లేదంటూ కేంద్రమంత్రి మండిపడ్డారు. 

హైదరాబాద్‌లో జరిగిన వంద రోజుల ప్రగతిపై మాట్లాడిన ఆర్కే సింగ్ పీపీఏలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగినట్లు తమ దగ్గరికి లేఖలతో వచ్చి రద్దు చేయమని కోరుతున్నారని విమర్శించారు. దాని ప్రభావం పెట్టుబడులపై తీవ్రంగా చూపుతుందన్నారు. 
 
అవకతవకలపై ఎలాంటి ఆధారాలు లేకుండా పీపీఏను రద్దు చేయమంటే ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ వైఖరి పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని మండిపడ్డారు. పవర్ ప్రాజెక్టులపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కేంద్రమంత్రి ఆర్కే సింగ్.  

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ప్రభుత్వానికి కేంద్రం షాక్

విదేశీ బ్యాంకుల షాక్: పిపిఎల రద్దుపై వెనక్కి తగ్గిన జగన్ సర్కార్

వైఎస్ జగన్ కు జపాన్ కరెంట్ షాక్

పీపీఏల వల్ల రాష్ట్రానికి లాభం లేదు.. అందుకే రద్దు చేశాం: జగన్

జగన్ సర్కార్ కు తలనొప్పిగా పీపీఏల అంశం: హైకోర్టులో మరో రెండు పిటీషన్లు

మోదీ ప్రభుత్వంతో సమరానికి జగన్ సై : అగ్గిరాజేస్తున్న పీపీఏ అంశం

సోలార్, విండ్ కంపెనీల నుంచి విద్యుత్ నిలిపివేత: సీఎం జగన్ సంచలన నిర్ణయం

హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు: పీపీఏల పున:సమీక్షకు బ్రేక్

జగన్ సర్కార్ కు అప్పిలేట్ ట్రిబ్యునల్ షాక్