Asianet News TeluguAsianet News Telugu

యురేనియం తవ్వకాలు తెలుగు రాష్ట్రాలకు ముప్పు: జనసేనాని పవన్ కళ్యాణ్

యురేనియం తవ్వకాల వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతాయని తెలిపారు. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. రేడియేషన్‌తో మహిళల్లో గర్భసంచి సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు.

janasena chief pawan kalyan demands Uranium mining should be stopped
Author
Hyderabad, First Published Sep 9, 2019, 5:20 PM IST

హైదరాబాద్: యూరేనియం తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. 

జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ కలిశారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. 

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ యురేనియం తవ్వకాల వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతాయని తెలిపారు. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. 

రేడియేషన్‌తో మహిళల్లో గర్భసంచి సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. ఈ విషయం చాలా మంది జనసేన పార్టీ దృషికి తీసుకు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఉపద్రవాలను దృష్టిలో పెట్టుకొని యురేనియం తవ్వకాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లనుంది..? 

కృష్ణా జలాలు ఎలా కలుషితం కాబోతున్నాయి..?. ఆ నీరు తాగిన ప్రజలకు ఎలాంటి జబ్బులు రాబోతున్నాయి..?.  అన్నదానిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి పర్యావరణ శాస్ర్తవేత్తలు, నిపుణులతో మాట్లాడి ప్రజల్లోకి వెళ్తామని చెప్పుకొచ్చారు. అయితే రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు నిర్వహించేది రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కళ్యాణ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ భేటీ

Follow Us:
Download App:
  • android
  • ios