Asianet News TeluguAsianet News Telugu

ఉత్కంఠకు తెర: ఆర్టికల్ 371 జోలికి వెళ్లమన్న అమిత్ షా

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో .. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 371 సైతం రద్దు చేస్తారని వస్తున్న వార్తలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. తాము ఎట్టిపరిస్ధితుల్లో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని షా స్పష్టం చేశారు.

centre won not touch article 371, says Union Home Minister amit shah at guwahati
Author
Guwahati, First Published Sep 9, 2019, 10:40 AM IST

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో .. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 371 సైతం రద్దు చేస్తారని వస్తున్న వార్తలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు.

ఆదివారం గౌహతిలో జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి 68వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. తాము ఎట్టిపరిస్ధితుల్లో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని అమిత్ షా స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని తాను ఇది వరకే పార్లమెంటులో తెలియజేశానని షా గుర్తు చేశారు. నేడు మరోసారి 8 మంది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో తెలియజేస్తున్నానన్నారు.

ఆర్టికల్ 370ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినందునే దానిని రద్దు చేశామని.. అయితే ఆర్టికల్ 371 మాత్రం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుందని.. ఈ రెండింటికి మధ్య చాలా తేడాలున్నాయని అమిత్ షా పేర్కొన్నారు.

ఎన్‌ఆర్‌సీ గురించి మాట్లాడుతూ..  అక్రమంగా ఒక్క చోరబాటుదారుని కూడా దేశంలోకి అనుమతించబోమని హోంమంత్రి స్పష్టం చేశారు. ఈశాన్య భారతంలోని పలు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరముందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios