Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా గల్లంతు: అసెంబ్లీలో ముందు సీట్లలోకి మజ్లిస్

తెలంగాణ అసెంబ్లీలో వివిధ పార్టీలకు కేటాయించిన సీట్ల స్థానాలు మారిపోయాయి. సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోవడంతో ఎంఐఎం సభ్యులకు ముందు వరుస సీట్లు కేటాయించారు. రెండో వరుసలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సీటు ఇచ్చారు. 
 
seats allotment changed in telangana assembly
Author
Hyderabad, First Published Sep 9, 2019, 1:21 PM IST

తెలంగాణ అసెంబ్లీలో వివిధ పార్టీలకు కేటాయించిన సీట్ల స్థానాలు మారిపోయాయి. సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోవడంతో ఎంఐఎం సభ్యులకు ముందు వరుస సీట్లు కేటాయించారు. రెండో వరుసలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సీటు ఇచ్చారు.

డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచి ప్రధాన ప్రతిపక్ష హోదా పొందింది. కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్షనేతగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే హస్తం పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం కావడంతో కాంగ్రెస్ బలం తగ్గిపోయి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది.

ఏడుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ కంటే ఎంఐఎం సభ్యుల బలం ఎక్కువ కావడంతో ఆ పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలివున్నారు. దీంతో స్పీకర్ సభా నిబంధనల మేరకు ఆయా పార్టీల సీట్ల స్థానాన్ని మార్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios