హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాజీనామా చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు.చేతులు కాలిన తర్వాత పీసీసీ చీఫ్ పదవి ఇస్తే ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పదవి వద్దని రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన తర్వాత కూడ  ఏం చేస్తామని ఆయన ప్రశ్నించారు.

తనకు మునుగోడు అభివృద్ది ముఖ్యమే అని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా కూడ కేసీఆర్ వినే పరిస్థితిలో లేడని తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర గురించి వ్యాఖ్యానించారు.రైతుల గురించి యాత్ర చేయడాన్ని  ఆయన మరో వైపు సమర్ధించారు.