హైదరాబాద్: శాసన మండలి చైర్మన్ గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక లాంఛనమే కానుంది. శాసనమండలి చైర్మన్ ఎన్నికల లాంఛనమే కాబట్టి ఈనెల 11న ఎన్నిక నిర్వహించనున్నట్లు శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

శాసనమండలి చైర్మన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గడువు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ముగిసింది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన వారెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో 

గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది. ఇకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ ను ఏడుగురు శాసన మండలి సభ్యులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇకపోతే 11 ఉదయం 11.30 గంటలకు శాసన మండలి సమావేశమై గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసన మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డిప్యూటీ చైర్మన్ మండలిలో ప్రకటించనున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 

ఈ నెల 14 నుంచి 22 వరకు శాసన మండలి సమావేశాలు జరుగనున్నాయి. అక్టోబర్‌లో రెవెన్యూ బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అక్టోబర్‌లో మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

ఈ బడ్జెట్ సమావేశాలను 21 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 24న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కానిస్టిట్యూషనల్ క్లబ్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

శాసనమండలి ఛైర్మెన్ గా సుఖేందర్ రెడ్డి: జూపల్లి, నాయినిలకు పదవులు

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....