Telugu News Updates : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:08 PM (IST) Jun 13
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో సౌతాఫ్రికా విజయం దిశగా క్రమంగా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 213 పరుగుల వద్ద కొనసాగుతోంది. సౌతాఫ్రికా విజయానికి ఇంకా కేవలం 69 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది.
10:50 PM (IST) Jun 13
మరో అరుదైన రికార్డుకు వేదికైంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ బ్యాటర్లు అరుదైన రికార్డును సృష్టించారు. వివరాల్లోకి వెళితే..
10:31 PM (IST) Jun 13
బోయింగ్ 777, 787 రెండింటినీ నడిపిన కెప్టెన్ స్టీవ్, " ఎయిర్ ఇండియా విమానం లిఫ్ట్ కోల్పోవడం చుట్టూ మూడు ప్రధాన సిద్ధాంతాలు తిరుగుతున్నాయి" అని అన్నారు.
10:02 PM (IST) Jun 13
09:38 PM (IST) Jun 13
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. డీఏను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
09:32 PM (IST) Jun 13
కారు కొనాలన్నా, అందులో ప్రయాణించాలన్నా ముందుగా చూసే విషయం సేఫ్టీ. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలకు ఎంత రక్షణ ఇస్తుందనేది చాలా ముఖ్యం. సేఫ్టీ విషయంలో మారుతి సుజుకి బలేనో బెస్ట్‌గా నిలిచింది. NCAP క్రాష్ టెస్ట్‌లో ఎక్కువ స్టార్ పాయింట్లు సాధించింది.
08:35 PM (IST) Jun 13
08:13 PM (IST) Jun 13
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ప్రమాద స్థలమైన భవన శిథిలాల మధ్య నుంచి విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
07:40 PM (IST) Jun 13
అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పటి నుంచి, ఇరాన్‌తో ఉద్రిక్తతలు ప్రాణాంతక ప్రాంతీయ సంఘర్షణగా మారాయి. రాయబార కార్యాలయాల బాంబు దాడులు, హత్యలు, క్షిపణి దాడులు, జూన్ 2025లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరానియన్ సైనిక స్థావరాలపై జరిగాయి.
06:35 PM (IST) Jun 13
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ చివరి దశకు చేరుకుంది. తొలి రెండు రోజుల పాటు బౌలర్ల ఆధిపత్యమే కనిపించిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా 282 పరుగుల గెలుపు లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది.
06:15 PM (IST) Jun 13
బిల్వపత్రం ఒక పవిత్రమైన, ఔషధ మొక్క. ఇది జీర్ణక్రియ, మధుమేహం, గుండె ఆరోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఆకులు పోషకాలతో సమృద్ధిగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
06:08 PM (IST) Jun 13
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఎండ కాలం ఇలా ముగిసిందో లేదో అలా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదే తరుణంలో పిడుగు పాటికి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
05:48 PM (IST) Jun 13
పసుపు-నల్ల మిరియాల షాట్ శరీరంలోని చెడు కొవ్వును తొలగించడంలో, కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఈ పానీయం రోజూ తీసుకుంటే జీవక్రియ వేగంగా పనిచేస్తుంది, బరువు తగ్గుతుంది.
05:40 PM (IST) Jun 13
నూనె శ్రీధర్.. గత కొన్ని రోజులుగా ఈ పేరు మారుమోగుతోంది. ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో శ్రీధర్‌ను అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
05:29 PM (IST) Jun 13
మారుతి సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ వేగన్ ఆర్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెలలోనే దీన్ని కొనుక్కుంటే సుమారు రూ.లక్ష వరకు తగ్గింపు లభిస్తుంది. ఇదే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాప్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు వంటి అనేక ఆఫర్లు కూడా ఉన్నాయి.
05:23 PM (IST) Jun 13
ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌లకే పరిమితమవుతున్నారు. ఇది వారు పెద్దవారయ్యే నాటికి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
05:15 PM (IST) Jun 13
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో భాగంగా విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపారు.
04:52 PM (IST) Jun 13
Personal Loan: డబ్బుతో ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. ఇప్పటికే పర్సనల్ లోన్ ఉన్నా టాప్ అప్ తీసుకోవచ్చు. కాని లోన్ తీసుకొనే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
04:27 PM (IST) Jun 13
ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. అయితే క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చేసే విషయంలో కొందరు ఇబ్బందులు పడుతుంటారు. డ్యూ డేట్ మర్చిపోతుంటారు. అయితే ఫోన్‌పే ద్వారా చాలా సులభంగా క్రెడిట్ కార్డు బిల్స్ పేమెంట్ చేయొచ్చని మీకు తెలుసా?
04:17 PM (IST) Jun 13
తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో రాష్ట్రానికి రూ. 10,000 కోట్ల ఆదాయం రావడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.
04:12 PM (IST) Jun 13
ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ ఎంత అవసరమో జరుగుతున్న ప్రమాదాలు తెలియజేస్తున్నాయి. ఫ్లైట్, ట్రైన్, బస్ ఇలా ఏదైనా టికెట్ బుక్ చేసుకొనేటప్పుడే ఇన్యూరెన్స్ తీసుకోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా విమానాలు, రైళ్లు ఆలస్యమైనప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది.
03:47 PM (IST) Jun 13
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రెండవ రోజు ఆట ముగిసింది. మూడవ రోజు తొలి సెషన్ ప్రారంభానికి కాసేపే ఉంది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్‌లో ఆటంకం రావచ్చన్న ఆందోళన కనిపిస్తోంది.
03:19 PM (IST) Jun 13
ఫాదర్స్ డే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేమతో జరుపుకుంటారు. ఈ రోజున బహుమతులకంటే తండ్రి ప్రేమను గుర్తించటం, ఆయన త్యాగాలకు కృతజ్ఞత చెప్పటం ముఖ్యమైనది.
02:59 PM (IST) Jun 13
ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో మరో కొత్త యుద్ధానికి తెర తీసినట్లైంది. దీని ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ముఖ్యంగా భారత్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
01:50 PM (IST) Jun 13
Plane crash: ఫ్లైట్ లో ప్రయాణించే వారికి పారాచూట్లు ఇవ్వొచ్చు కదా.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాని ఎందుకు ఇవ్వరు? అని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి చాలా కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
01:41 PM (IST) Jun 13
వాస్తు సూత్రాల ప్రకారం అద్దాలను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యంలో ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుంది. దక్షిణ, ఆగ్నేయం మాత్రం పెట్టకూడదు.
01:00 PM (IST) Jun 13
విమాన ప్రమాదంలో మరణించిన అర్జున్ పట్టోలియా, తన భార్య చివరి కోరిక తీర్చేందుకు ఇండియా వచ్చాడు. ఇంతలోనే ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు.
12:30 PM (IST) Jun 13
Flipkart: ఐఫోన్ కొనుక్కోవడం మీ లక్ష్యమా? అయితే మీకు ఇదే మంచి సమయం. ఫ్లిప్ కార్ట్ మీకోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఐఫోన్ 16పై ఫ్లాట్ డిస్కౌంట్ తో పాటు అదనపు ఆఫర్లు కూడా ప్రకటించింది. దీంతో భారీ తగ్గింపుతో మీరు ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.
12:08 PM (IST) Jun 13
తెలుగు ప్రజలు బి అలర్ట్. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. కాబట్టి ఇవాళ ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
12:08 PM (IST) Jun 13
ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన పైలట్ సుమిత్ చివరి మాటలు కన్నీరు పెట్టిస్తున్నాయి. త్వరలోనే ఉద్యోగం మానేసి వచ్చి ఒంటరిగా ఉంటున్న తండ్రిని చూసుకుంటానని ఆయన చెప్పిన మాటలు తలచుకొని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
11:07 AM (IST) Jun 13
ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. 5 ఏళ్లు పూర్తయినవారికి బదిలీ తప్పనిసరి చేసిన ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
10:36 AM (IST) Jun 13
ఎయిర్ ఇండియా ప్రమాదాన్ని షర్మిష్ఠ అనే జ్యోతిష్కురాలు ఆరునెలల ముందే ఊహించి చెప్పినట్లు పాత ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరీ షర్మిష్ఠ, ఆమె నిజంగానే ప్రమాదం గురించి చెప్పిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
09:47 AM (IST) Jun 13
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయంలో సాంకేతికంగా ముందడుగు వేస్తోంది. అందుకోసం 80% సబ్సిడీతో రైతులకు డ్రోన్లును అందించనుంది. దీనివల్ల ఖర్చులు తగ్గి, ఆరోగ్యపరమైన సమస్యలు దూరమవడంతో సేద్యం మరింత లాభసాటి అవుతోంది.
08:49 AM (IST) Jun 13
T20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ దిగజారారు. ఇదే సమయంలో టాప్ 3లోకి ఇద్దరు భారతీయ ఆటగాళ్ళు దూసుకెళ్లారు.
07:49 AM (IST) Jun 13
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ సడెన్ ఎయిర్‌స్ట్రైక్స్ కు దిగింది... దీంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ దాడులపై అమెరికా కూడా స్పందించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి