ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రెండవ రోజు ఆట ముగిసింది. మూడవ రోజు తొలి సెషన్ ప్రారంభానికి కాసేపే ఉంది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్‌లో ఆటంకం రావచ్చన్న ఆందోళన కనిపిస్తోంది. 

రెండవ రోజు దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుత ప్రదర్శన చూపారు. ఆస్ట్రేలియా జట్టుపై ఒత్తిడి తీసుకురాగలిగారు. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఆధిక్యం ఉంది. లంచ్ విరామానంతరం వర్షం కారణంగా కొద్దిసేపు నిలిపివేయాల్సి వచ్చింది. కానీ వర్షం పెద్దగా ఆటగాళ్లకు ఇబ్బంది కలిగించలేదు.

రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ (16*), నాథన్ లియాన్ (1*) క్రీజులో ఉన్నారు.

అక్యూ వెద‌ర్ నివేదిక ప్రకారం, మూడవ రోజు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. ఉదయం వాతావరణం వేడిగా ఉంటుంది. మధ్యాహ్నం 91% మేఘావృతత ఉండే అవకాశం ఉంది. సాయంత్రానికి అది 97%కు పెరిగే అవకాశం ఉంది. ఇది చూస్తే సాయంత్రం వర్షం పడే అవకాశముంది. అంటే ఆటకు అంతరాయం కలగవచ్చు.

ఇప్పటి వరకు మ్యాచ్ స్టేట‌స్ ఇలా ఉంది:

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 212 ఆలౌట్

దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 138 ఆలౌట్

ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ (స్టంప్స్ సమయానికి): 144/8

మొత్తం ఆధిక్యం: 218 పరుగులు

ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లు పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. అలెక్స్ కారీ 43 పరుగులతో అద్భుతంగా ఆడాడు. లాబుస్చాగ్నే 22, స్మిత్ 13 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ కాంబినేషన్ ప్రభావం చూపించింది. కగిసో రబాడా 3 వికెట్లు, లుంగి న్గిడి 3 వికెట్లు, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్ తలో వికెట్ తీసుకున్నారు.