Flipkart: ఐఫోన్ కొనుక్కోవడం మీ లక్ష్యమా? అయితే మీకు ఇదే మంచి సమయం. ఫ్లిప్ కార్ట్ మీకోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఐఫోన్ 16పై ఫ్లాట్ డిస్కౌంట్ తో పాటు అదనపు ఆఫర్లు కూడా ప్రకటించింది. దీంతో భారీ తగ్గింపుతో మీరు ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. 

ఆపిల్ అభిమానులకు శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, Apple iPhone 16(128GB, బ్లాక్ కలర్ వేరియంట్)పై భారీ ధర తగ్గింపు ప్రకటించింది. లాంచ్ సమయంలో దీని ధర రూ.79,900గా ఉన్నా, ఇప్పుడు అదే వేరియంట్‌ను రూ.9,901 ఫ్లాట్ డిస్కౌంట్ తో కేవలం రూ.69,999కి అందిస్తున్నారు. ఈ తగ్గింపు ప్రత్యేకంగా బ్లాక్ కలర్‌తో ఉన్న 128GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. 

పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.45,150లకే ఐఫోన్ 16

వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మీ డివైజ్ పరిస్థితి, మీరున్న ఏరియాను బట్టి గరిష్ఠంగా రూ.45,150 వరకు అదనపు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అంతేకాక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అలాగే ఎంపిక చేసిన యాక్సిస్ బ్యాంక్ UPI లావాదేవీలపై రూ.500 క్యాష్‌బ్యాక్‌ను సూపర్‌మనీ ద్వారా పొందవచ్చు.

ఐఫోన్ 16 ముఖ్యమైన ఫీచర్లు ఇవే..

డిస్‌ప్లే: 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED, HDR సపోర్ట్, గరిష్ఠంగా 2000 నిట్స్ బ్రైట్నెస్.

ప్రాసెసర్: పవర్‌ఫుల్ A18 చిప్ – 6-కోర్ CPU, 5-కోర్ GPU, 16-కోర్ న్యూయురల్ ఇంజిన్.

కెమెరాలు: డ్యుయల్ రియర్ కెమెరాలు – 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్; 12MP ఫ్రంట్ కెమెరా.

బ్యాటరీ: 22 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యం; 25W ఫాస్ట్ ఛార్జింగ్, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

డిజైన్: IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్.

కనెక్టివిటీ: Wi-Fi 7, బ్లూటూత్ 5.3, USB-C పోర్ట్, 5G సపోర్ట్.

అదనపు ఫీచర్లు: యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్.

ప్రస్తుతానికి ఈ ఆఫర్ కేవలం బ్లాక్ కలర్ 128GB వేరియంట్‌కే ఉంది. అయితే ఇతర కలర్, స్టోరేజ్ వేరియంట్‌లపై కూడా ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్లు ఉన్నాయి. అయితే వాటి ధరలు స్టాక్ అందుబాటును బట్టి మారే అవకాశం ఉంటుంది. ఐఫోన్ 16 కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం.