MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Personal Loan: పర్సనల్ లోన్‌పై టాప్ అప్ కావాలా? సిబిల్ ఎంత ఉండాలో తెలుసా?

Personal Loan: పర్సనల్ లోన్‌పై టాప్ అప్ కావాలా? సిబిల్ ఎంత ఉండాలో తెలుసా?

Personal Loan: డబ్బుతో ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. ఇప్పటికే పర్సనల్ లోన్ ఉన్నా టాప్ అప్ తీసుకోవచ్చు. కాని లోన్ తీసుకొనే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jun 13 2025, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పర్సనల్ లోన్ టాప్ అప్ అంటే ఏమిటి?
Image Credit : PR

పర్సనల్ లోన్ టాప్-అప్ అంటే ఏమిటి?

ఇప్పటికే పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి  అదనపు డబ్బును అప్పుగా తీసుకోవడాన్ని పర్సనల్ లోన్ టాప్-అప్ అంటారు. ఇది కొత్త లోన్ కాదు. ఇప్పటికే ఉన్న లోన్ పై అదనంగా తీసుకోవడం మాత్రమే. ఇది అందరికీ ఇవ్వరు. నమ్మకమైన కస్టమర్లకు మాత్రమే బ్యాంకులు ఇస్తాయి. అది కూడా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కొత్తగా అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు
Image Credit : Google

కొత్తగా అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు

మీ ప్రస్తుత లోన్‌పై అదనంగా డబ్బు పొందే వెసులుబాటునే పర్సనల్ లోన్ టాప్-అప్ అంటారు. దీనికోసం కొత్తగా లోన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రస్తుత లోన్ ఇచ్చిన బ్యాంకు నుండే దీన్ని పొందవచ్చు. అయితే ఈ లోన్ పొందాలంటే మీరు ముందుగా తీసుకున్న పర్సనల్ లోన్ కనీసం 6 నుండి 12 నెలల ఈఎంఐలు కరెక్ట్ గా కట్టి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే బ్యాంకులు టాప్-అప్ ఇస్తాయి.

36
అత్యవసర పరిస్థితులకు టాప్ అప్ వాడుకోవచ్చు
Image Credit : our own

అత్యవసర పరిస్థితులకు టాప్ అప్ వాడుకోవచ్చు

మీ కేవైసీ వివరాలు (PAN, Aadhaar, repayment history) బ్యాంకు వద్ద ఉండటం వల్ల ఈ లోన్ త్వరగా, సులభంగా లభిస్తుంది. వైద్య అత్యవసరాలు, ఇంటి మరమ్మతులు, రుణ ఏకీకరణ వంటి అవసరాలకు దీన్ని ఉపయోగించవచ్చు. 

వడ్డీ రేటు సాధారణంగా 10% నుండి 14% వరకు ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే వడ్డీ తక్కువగా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. లోన్ కాలవ్యవధి సాధారణంగా మీ పాత లోన్ మిగిలిన కాలం వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు 60 నెలల వరకు ఇస్తాయి.

46
సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే?
Image Credit : PR

సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే?

పర్సనల్ లోన్ టాప్ అప్ పొందాలంటే మంచి క్రెడిట్ హిస్టరీ కచ్చితంగా ఉండాలి.  ముఖ్యంగా 750 కంటే ఎక్కువ సిబిల్ ఉండాలి. ఇప్పటికే తీసుకున్న పర్సనల్ లోన్ ఈఎంఐలు కరెక్ట్ గా కట్టగలుగుతున్నారు కాబట్టి టాప్ అప్ కి కూడా ఈఎంఐ కట్టే సామర్థాన్ని మీరు కలిగి ఉండాలి. ఆ విధంగా ఆదాయ మార్గం ఉన్న వాళ్లు మాత్రమే టాప్ అప్ తీసుకోవాలి. 

56
ఎలా అప్లై చేసుకోవాలి?
Image Credit : our own

ఎలా అప్లై చేసుకోవాలి?

టాప్ అప్ కావాల్సిన వారు పర్సనల్ లోన్ ఇచ్చిన బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో కూడా బ్యాంకు వెబ్ సైట్ కి వెళ్లి అప్లై చేయొచ్చు. మీ ఆర్థిక అవసరాలు పెరిగితే అవి తీర్చుకోవడానికి టాప్-అప్ లోన్ ఉపయోగపడుతుంది. ఆకస్మిక ఖర్చులు వస్తే టాప్-అప్ లోన్ ఉపయోగపడుతుంది. పెద్ద పెట్టుబడి పెట్టాలన్నా, కొత్త ఆస్తి కొనాలన్నా దీన్ని ఉపయోగించుకోవచ్చు.

66
అనవసరంగా తీసుకుంటే అవస్థలే
Image Credit : our own

అనవసరంగా తీసుకుంటే అవస్థలే

ఏదైనా అత్యవసరం అయితేనే టాప్ అప్ లోన్ తీసుకోవాలి. తీసుకున్న డబ్బును ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉపయోగించాలి. లేకపోతే ఈఎంఐల బర్డెన్ పెరిగిపోతుంది. అప్పు మీద అప్పు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు మరిన్ని పెరిగిపోతాయి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
Home Loan: మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి
Recommended image2
Home Loan: మీరు ఇల్లు కొనాలనుకుంటే ఇదే మంచి టైమ్: రెపో రేటు తగ్గడంతో అన్ని బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved