మరో అరుదైన రికార్డుకు వేదికైంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ బ్యాటర్లు అరుదైన రికార్డును సృష్టించారు. వివరాల్లోకి వెళితే..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా క్రికెటర్లు మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్ అరుదైన రికార్డును బద్దలు కొట్టారు. ఈ ఇద్దరూ కలిసి ఐసీసీ ఫైనల్స్ చరిత్రలో 10వ వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన జోడిగా నిలిచారు.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్ 136 బంతుల్లో 5 ఫోర్లు బాది 58 పరుగులు చేయగా, హజెల్‌వుడ్ 53 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి 10వ వికెట్‌కు 59 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. ఇది ఐసీసీ ఫైనల్స్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక 10వ వికెట్ జోడీ.
50 ఏళ్ల రికార్డును అధిగమించారు
1975 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో డెన్నిస్ లిల్లీ – జెఫ్ థామ్సన్ జంట వెస్టిండీస్‌పై 10వ వికెట్‌కు 41 పరుగులు జోడించింది. ఈ రికార్డు ఐసీసీ ఫైనల్స్‌లో అప్పటి వరకూ అగ్రస్థానంలో ఉండగా, తాజా మ్యాచ్‌లో స్టార్క్-హజెల్‌వుడ్ దాన్ని అధిగమించారు.
ఐసీసీ ఫైనల్స్‌లో 10వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాలు:
59 – మిచెల్ స్టార్క్ – జోష్ హజెల్‌వుడ్ (WTC ఫైనల్ 2025)
41 – డెన్నిస్ లిల్లీ – జెఫ్ థామ్సన్ (వన్డే వరల్డ్ కప్ 1975 ఫైనల్)
22 – సయ్యద్ కిర్మాణి – బల్విందర్ సంధు (వన్డే వరల్డ్ కప్ 1983 ఫైనల్)
ఇక మరో అరుదైన ఫీట్ – టెస్ట్‌లో మూడోసారి 50+ భాగస్వామ్యం
స్టార్క్-హజెల్‌వుడ్ జోడీ, టెస్ట్ క్రికెట్‌లో 10వ వికెట్‌కు మూడోసారి 50కి పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇంతవరకు ఈ ఘనత న్యూజిలాండ్ జోడీ బీజే వాట్లింగ్ – ట్రెంట్ బౌల్ట్‌కు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ రికార్డును వారు సమం చేశారు.
టెస్ట్‌ల్లో 10వ వికెట్‌కు 50+ భాగస్వామ్యం చేసిన భాగప్వామ్యం:
3 – మిచెల్ స్టార్క్ – జోష్ హజెల్‌వుడ్
3 – బీజే వాట్లింగ్ – ట్రెంట్ బౌల్ట్
2 – సిడ్నీ కాలావే – ఆల్బర్ట్ ట్రాట్
2 – అలాన్ డొనాల్డ్ – షాన్ పొలాక్
2 – మురళీధరన్ – చమిందా వాస్
2 – జానీ బెయిర్‌స్టో – జేమ్స్ అండర్సన్
2 – జాసన్ గిలెస్పీ – గ్లెన్ మెక్‌గ్రాత్
