ఎయిర్ ఇండియా ప్రమాదాన్ని షర్మిష్ఠ అనే జ్యోతిష్కురాలు ఆరునెలల ముందే ఊహించి చెప్పినట్లు పాత ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరీ షర్మిష్ఠ, ఆమె నిజంగానే ప్రమాదం గురించి చెప్పిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దేశ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఘటన అహ్మదాబాద్ విమాన ప్రమాదం.ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు చనిపోగా..ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా దుర్మరణం పాలయ్యారు. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ మీద కూలిపోవడంతో అక్కడ ఉన్న 20 మంది మెడికోలు కూడా చనిపోయారు.
చరిత్రలో రెండో అతిపెద్ద..
ఇది ఎయిర్ ఇండియా చరిత్రలో రెండో అతిపెద్ద విమాన ప్రమాదంగా నమోదైంది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత, సోషల్ మీడియాలో షర్మిష్ఠ అనే జ్యోతిష్కురాలు చేసిన పాత ట్వీట్లు బాగా వైరల్ అవుతున్నాయి. 2024 అక్టోబర్‌లోనే ఆమె ఎక్స్ (Twitter) ద్వారా 2025 సంవత్సరానికి సంబంధించిన జ్యోతిష్య ఫలితాలు ప్రకటించారు. వాటిలో విమానయాన రంగం వేగంగా ఎదుగుతుందని, అయితే ఓ భారీ విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తుందని తెలిపారు.
మెరుగుపడుతుంది, కానీ…
డిసెంబరులో ఆమె మరోసారి అదే అంశంపై ట్వీట్ చేస్తూ, “విమానయాన రంగం మెరుగుపడుతుంది, కానీ ప్రమాదాలూ చాలా జరుగుతాయి” అంటూ హెచ్చరించారు. గురు గ్రహం మిథునరాశిలో ఉండటం వల్ల అభివృద్ధి జరుగుతుందని, కానీ భద్రతలో లోపాలు ఉండే అవకాశం ఉందని వివరించారు.
గుజరాత్ మాజీ సీఎం…
ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ కావడంతో, కొందరికి ఆమె అంచనాల కచ్చితత్వం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే, మరికొందరైతే ఇది కేవలం ప్రచారం కోసమే చేస్తున్న ప్రయత్నమంటూ విమర్శిస్తున్నారు.ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు బ్రిటన్‌కు చెందిన వైద్య దంపతులు ఫియోంగల్ గ్రీన్లా-మీక్, జామీ మీక్ కూడా మరణించారు. భారత పర్యటన ముగించుకుని లండన్‌కి తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు వారు ఈ విమానాన్ని ఎక్కారు. ప్రమాదానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం వారి చివరి గుర్తుగా మిగిలింది.


