తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జపాన్ లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ టీమ్ ఈరోజు కూడా పలు సంస్థలతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈరోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలకు సంబంధించిన లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

12:05 AM (IST) Apr 20
AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగల ఎదురుచూపులు ఫలిచాయి. ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 19వ తేదీ అర్థరాత్రి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించింది.
పూర్తి కథనం చదవండి11:47 PM (IST) Apr 19
దాదాపు ప్రతి హిందూ ఇంట్లో ఒక చిన్న మందిరం ఉంటుంది, అక్కడ చాలా దేవతల చిత్రపటాలు లేదా విగ్రహాలు ఉంటాయి. వాస్తు ప్రకారం, కొంతమంది దేవతల చిత్రపటాలను ఇంట్లో ఉంచకూడదు.
పూర్తి కథనం చదవండి
11:41 PM (IST) Apr 19
రాహు రాశి పరివర్తన 2025: మే 2025లో రాహు గ్రహం రాశిని మారుస్తుంది, దీనివల్ల ప్రమాదకరమైన యోగం ఏర్పడుతుంది. ఈ అశుభ యోగం ప్రభావం 4 రాశులవారిపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశులవారు ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండాలి.
పూర్తి కథనం చదవండి
11:32 PM (IST) Apr 19
మాధురి దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ నేనే దగ్గర దాదాపు 20 కోట్ల విలువ చేసే కార్ల కలెక్షన్ ఉంది. పోర్ష్, మెక్‌లారెన్, ఫెరారీ లాంటి ఖరీదైన కార్లు ఇందులో ఉన్నాయి. మాధురికి రేస్ ట్రాక్‌లో కారు నడపడం కూడా ఇష్టం.
పూర్తి కథనం చదవండి11:29 PM (IST) Apr 19
తమన్నా, జాన్ అబ్రహాం జోడీ. రోహిత్ శెట్టి తదుపరి సినిమాలో భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బయోపిక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా, ప్రీతి మారియా పాత్ర పోషించనుంది.
పూర్తి కథనం చదవండి11:24 PM (IST) Apr 19
రితేష్ దేశ్‌ముఖ్ రాబోయే 'రాజా శివాజీ' సినిమా కోసం లోగో డిజైన్ కాంటెస్ట్ ప్రకటించారు. డిజైనర్లకు అదిరిపోయే లోగో డిజైన్ చేసి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇదో మంచి అవకాశం. ముంబై ఫిలిం కంపెనీ, జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి10:45 PM (IST) Apr 19
Vaibhav Suryavanshi IPL Debut: 14 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి బంతినే సిక్సర్ బాది అదిరిపోయే అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే సూపర్ నాక్ తో అదరగొట్టాడు. అతనే రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ.
పూర్తి కథనం చదవండి10:21 PM (IST) Apr 19
బాలీవుడ్ స్టార్ హీరో నటించిన 40 సినిమాలు ప్లాప్ అయ్యాయి, 33 సినిమాలు రిలీజ్ కాలేదు. మూవీ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పేస్ చేసిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
10:12 PM (IST) Apr 19
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్లలో నటించిన పలు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. కానీ ఆయనకు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. అంతేకాదు. తెలుగు. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన సినిమా చిరంజీవి హిందీలో రీమెక్ చేసి ప్లాప్‌ను మూటగట్టుకున్నారు. ఆ తర్వాత బాలివుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. అలాంటి చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
పూర్తి కథనం చదవండి09:41 PM (IST) Apr 19
DC vs GT: ఐపీఎల్ 2025లో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు గుజరాత్ టైటాన్స్ షాక్ ఇచ్చింది. జోస్ బట్లర్ సూపర్ నాక్ తో చివరి ఓవర్ లో శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ జట్టుపై థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.
08:20 PM (IST) Apr 19
Instagrams New Blend Feature: ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ‘బ్లెండ్’ అనే ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు మీ ఫ్రెండ్స్‌తో కలిసి మీకు నచ్చిన రీల్స్ చూడొచ్చు. షేర్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టాయిష్టాలను బట్టి రీల్స్ సెలెక్ట్ చేసి ఇన్‌స్టా మీకు చూపిస్తుంది. గ్రూప్ చాట్‌లో కూడా ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:17 PM (IST) Apr 19
TTD: తిరుపతిలోని తిరుమలలో కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. రోజుకి కొన్ని లక్షల మంది స్వామి వారిని దర్శించుకుని వెళ్తుంటారు. అయితే.. ఇటీవల తిరుమలో జరుగుతున్న పలు సంఘటనలు కలకలం రేపుతున్నాయి. అన్యమత ప్రచారం తిరుమలో జరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టీటీడీలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను తొలగించాలని బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వీరందరికీ మరోరకంగా న్యాయం చేస్తామని హామీ కూడా ఇస్తున్నారు.
పూర్తి కథనం చదవండి07:49 PM (IST) Apr 19
మనం చాలా సామెతలు వింటుంటాం. చిన్ననాటి నుంచి మన పెద్దలు, ఇరుగుపొరుగు వారు రకకరాల సామెతలను చెబుతుంటారు. చిన్నగా సింపుల్‌గా ఉండే సామెతల్లో ఎంతో అర్థం దాగి ఉంటుంది. వందల పదాల్లో కూడా చెప్పలేని భావాన్ని ఒక చిన్న లైన్ సామెతలో చెప్పొచ్చు. ఇలాంటి సామెతల్లో ఒకదాని గురించి, దాని వెనకాల ఉన్న అసలు అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
07:18 PM (IST) Apr 19
ప్రస్తుతం టెలికం రంగంలో భారీగా పోటీ పెరిగింది. దీంతో టెలికం కంపెనీలు రకరకాల ప్లాన్స్ తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా డేటా వినియోగం పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో ఇంటర్నెట్ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ టెల్ యూజర్ల కోసం ఒక ఆకర్షణీయమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
06:58 PM (IST) Apr 19
శనివారం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు కాశ్మీర్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించాయి... దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
పూర్తి కథనం చదవండి06:46 PM (IST) Apr 19
Fastest Indian to 200 IPL sixes: ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్‌లో 138 మ్యాచ్‌లు ఆడి 4,949 పరుగులు చేశాడు. 45.82 సగటు, 135 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో తన ఆటను కొనసాగించాడు. ఈ క్రమంలోనే సిక్సర్లతో డబులు సెంచరీ కొట్టాడు. ధోని, కోహ్లీ, రోహిత్ శర్మలను అధిగమించాడు.
06:43 PM (IST) Apr 19
2025 చివరిలో భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.ఇప్పటికే ప్రధాని మోదీతో సాంకేతికత మరియు ఆవిష్కరణలపై చర్చించిన మస్క్ త్వరలోనే ప్రత్యక్షంగా భేటీ కానున్నాయి.
పూర్తి కథనం చదవండి06:28 PM (IST) Apr 19
ఇండియా, యుఎస్ మధ్య ట్రేడ్ టాక్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 23 నుంచి మొదలయ్యే ఈ చర్చల్లో 2030 నాటికి ద్వైపాక్షిక వ్యాపారాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో కీలక అంశాలపై చర్చిస్తారు.
పూర్తి కథనం చదవండి06:23 PM (IST) Apr 19
Modi Amaravati Visit: ఏపీ రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు కావడంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. మోదీ సభను సక్సెస్ చేయాలని వారికి సూచించారు. మే 2న జరగబోయే సభను గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకుంటున్నారు. మొత్తం 250 ఎకరాలను సభకోసం కేటాయించి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ కోసం 50 ఎకరాలకు పైగా కేటాయిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రధాని వస్తుండటంతో ఆయన ఎలాంటి వరాలు ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
06:17 PM (IST) Apr 19
కృత్రిమ మేధస్సు (AI) ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోంది, దీంతో ఎన్నికల సంఘం AI దుర్వినియోగాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకుంటోంది. డీప్‌ఫేక్‌లు మరియు తప్పుడు సమాచారం వంటి ఆందోళనలను పరిష్కరించడానికి మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి05:19 PM (IST) Apr 19
Earthquake Safety Tips: భూకంపం వస్తే అందరూ ప్రాణభయంతో ఇళ్లలోంచి రోడ్ల మీదకు వచ్చేస్తారు. అయితే ఈ లోగానే ఇళ్లు నేలకూలి చాలా మంది చనిపోతుంటారు. మరి భూకంపం వచ్చినప్పుడు ఏం చేస్తే ప్రాణాలకు రక్షణ కలుగుతుంది? ఇదే ప్రశ్నను చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? ఆ సూచనలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి05:17 PM (IST) Apr 19
ప్రస్తుతం టీ20 ఫార్మాట్ క్రికెట్లో అలవోకగా సెంచరీలు నమోదవుతున్నాయి. అతి తక్కువ బంతుల్లో అత్యధిక పరుగులు చేయడం ఆటగాళ్లకు అలవాటుగా మారిపోయింది. కానీ ఆనాటి టెస్ట్ క్రికెట్ జమానాలో కేవలం 3 ఓవర్లలో సెంచరీ రికార్డు నమోదయ్యిందంటే మీరు నమ్మగలరా? అయితే మీకు ఈ సూపర్ ఇన్నింగ్స్ గురించి తెలియాల్సిందే..
పూర్తి కథనం చదవండి03:54 PM (IST) Apr 19
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ పిల్లనిచ్చిన అత్తగారి దేశానికి రానున్నారు. వాన్స్ ఫ్యామిలీ ఇండియాలో మూడ్రోజులు పర్యటించనున్నారు. వాళ్లు పర్యటన ఇలా సాగనుంది...
పూర్తి కథనం చదవండి03:13 PM (IST) Apr 19
టెక్నాలజీ రోజురోజుకీ విస్తరిస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవం పెరుగుతోంది. ఒకప్పుడు 1 జీబీ డ్రైవ్ చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు చిటికెన వేలు గోరు సైజ్‌లో చిప్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే తాజాగా చైనా మరో అద్భుతాన్ని సృష్టించింది. ప్రపంచవమే ఆశ్చర్యపోయేలా కొత్త హార్డ్ డ్రైవ్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటీ హార్డ్ డ్రైవ్.? దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
02:49 PM (IST) Apr 19
అసలు కంటే కొసరే ఎక్కువ అనే సామెత ఈ వ్యవహారానికి సరిగ్గా సరిపోతుంది. ఓ కారు ధరకు కేవలం రిజిస్ట్రేషన్ నంబర్ అమ్ముడుపోయింది. హైదరాబాద్ లో ఓ ఫ్యాన్సీ వెహికిల్ నంబర్ లక్షలాది రూపాయలకు వేలంలో అమ్ముడుపోయింది. అంత గొప్ప నంబర్ ఏంటి? ఎంతకు అమ్ముడుపోయింది? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:44 PM (IST) Apr 19
అమెరికా-ఇరాన్ అణు ఒప్పందానికి సంబంధించి కీలక చర్చలు జరుగుతున్నాయి. రోమ్ వేదికగా జరుగుతోన్న ఈ చర్చల్లో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి01:36 PM (IST) Apr 19
Honda Dio 125: హోండా కంపెనీ నుంచి మరో కొత్త అప్టేడెట్ స్కూటర్ వచ్చేసింది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన డియో స్కూటర్ 2025లో కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చేసింది. ఈ స్కూటర్ ప్రత్యేకతలు, మైలేజ్, ధర తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి01:28 PM (IST) Apr 19
ప్రస్తుతం స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు కంపెనీలు అంటే వేల కోట్ల పెట్టుబడులు, వందలాది మంది ఉద్యోగుల్లా ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఐడియా ఉంటే చాలు చిన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లోనే కంపెనీ మొదలు పెట్టేస్తున్నారు. కేవలం 10 మందితోనే కంపెనీలు రన్ అవుతున్న సంస్థలు కూడా ఉన్నాయి. భారత్‌లో కూడా స్టార్టప్ ట్రెండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే భారత దేశంలోని ఓ నగరం స్టార్టప్‌ల విషయంలో ప్రపంచదేశాల్లోని ప్రముఖ నగరాలతో పోటీనిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
01:04 PM (IST) Apr 19
డీల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది. తన క్లాస్ మేట్ తో ఇంతకాాలం ప్రేమలో కొనసాగిన హర్షిత కేజ్రీవాల్ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. మరి హర్షిత కు సంభవ్ జైన్ ఎలా పరిచయం? ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? ఇప్పుడు హర్షిత, వైభవ్ ఏం చేస్తున్నారు? తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి12:06 PM (IST) Apr 19
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ సేవలో ఎప్పుడూ ముందుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా సేవా కార్యక్రమాలను చేపట్టేవారు పవన్. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీటిని మరింతి ఎక్కువ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ పవన్ ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
12:05 PM (IST) Apr 19
దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఒకవైపు ఎండలు దంచికొడుతున్నాయి. అయినా శుభకార్యల వేళ.. వేడుకలు చేసుకోక తప్పదు. ఇక పెళ్లి తర్వాత హనిమూన్ మాత్రం.. ఈ వేసవిలో చల్లని ప్రాంతానికి వెళ్లడం సరైన ఎంపిక. అందులోనూ అందమైన లోయలో హనిమూన్ చేసుకోవడం... ఐడియా అదిరింది కదూ.. మరి ఇండియాలో ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసా..?
పూర్తి కథనం చదవండి11:50 AM (IST) Apr 19
AI Travel Partner: మనిషి వెళ్లలేని చోటుకి కూడా ఇప్పుడు ఏఐ వెళ్తోంది. మనం ఏ విషయం గురించి అడిగినా క్షణాల్లో సమాధానం అందిస్తోంది. ప్రస్తుతం అనేక మంది ఏఐను ఉపయోగించి లాంగ్ టూర్స్, పర్యాటక ప్రాంతాలు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు ఎప్పుడు వెళ్లని ప్రాంతం అయినా, తెలిసిన ప్రాంతమైన అక్కడికి ఎలా సులువుగా చేరుకోవాల, వాహనాల అవైలబులిటీ, మీరు వెళ్లాలనుకున్న ప్రయాణానికి ఎంత బడ్జెట్ అవుతుంది. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి దుస్తులు ధరించాలి, మీ పిల్లల భద్రతకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను ఏఐ చెప్పేస్తోంది. మీ ప్రయాణంలో మీకు ట్రైన్, బస్సు సౌకర్యాం ఏది మంచిది.. అక్కడి ఇబ్బందులు తదితర అంశాలను ముందుగానే చెప్పేస్తోంది. ఏఐని ఉపయోగించి ఎలా టూర్ ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి11:47 AM (IST) Apr 19
మధుమేహం అదుపు: మధుమేహం.. అదుపులో ఉంచుకోకపోతే క్రమక్రమంగా శరీరంలోని అన్ని ముఖ్య అవయవాల్ని కబళించే రోగం. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం తప్పనిసరి. దీనికోసం రోజుకి పదివేల అడుగులు వేయమని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడు భోజనం తర్వాత 2 నిమిషాలు నడవడం వల్ల షుగర్ లెవెల్స్‌ని ఎంత సులభంగా అదుపులో ఉంచుకోవచ్చో చెబుతున్నారు.
పూర్తి కథనం చదవండి11:34 AM (IST) Apr 19
తెలుగు రాష్ట్రాల్లో మరో ఐద్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి? ఏఏ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:32 AM (IST) Apr 19
UPI Payments: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ చేయడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. కూరగాయల కొట్టు నుంచి స్టార్ హోటళ్లలో చెల్లింపుల దాకా అన్నింటికీ యూపీఐ సాధారణం అయిపోయింది. అయితే యూపీఐ లావాదేవీలపై కేంద్రప్రభుత్వం జీఎస్టీ వేయనుందని కొద్దికాలంగా వస్తున్న వార్తలు సామాన్యం జనంలో గగ్గోలు రేపుతున్నాయి. ముఖ్యంగా రూ.2000 కంటే ఎక్కువ UPI లావాదేవీలపై GST విధించనున్నట్లు వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
పూర్తి కథనం చదవండి11:23 AM (IST) Apr 19
ఇటీవల చాలా మందిలో ఆరోగ్యంతో పాటు అందంపై కూడా మక్కువ పెరుగుతోంది.మహిళలతో సమానంగా పురుషులు సైతం బ్యూటీ పార్లర్‌లకు క్యూ కడుతున్నారు. అయితే బ్యూటీ పార్లర్‌లకు వెళ్లడం అనేది ఖర్చుతో కూడుకున్న అంశం. అయితే ఇంట్లో దొరికే నేచురల్ వస్తువులతోనే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని మీకు తెలుసా.? అలాంటి వాటిలో టమాట ఒకటి. టమాట ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం. ఇంతకీ టమాట ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
11:00 AM (IST) Apr 19
తీవ్ర ఆరోగ్య సమస్యలు: టీ, సిగరెట్ కలిపి తాగడం చాలామంది పొగరాయుళ్లకు అలవాటు. కాస్త రిలీఫ్ కోసం, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇలా చేస్తుంటాం అంటారు. కానీ ఆ ఫలితాలు ఉండవు సరికదా.. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. ఇది వెంటనే ఆపేయకపోతే తీవ్ర ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.
పూర్తి కథనం చదవండి10:16 AM (IST) Apr 19
డిల్లీలో ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున జరిగిన వరుస ప్రమాదాల్లో ఐదుగురు మరణించగా చాలామంది గాయపడ్డారు.
పూర్తి కథనం చదవండి
09:17 AM (IST) Apr 19
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే ఇరు దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది. అయితే చర్చలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదన్న వార్తల నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
పూర్తి కథనం చదవండి