Earthquake: భూకంపం వస్తే ఏం చేయాలి? చాట్ జీపీటీ ఏం చెప్పిందో తెలుసా?
Earthquake Safety Tips: భూకంపం వస్తే అందరూ ప్రాణభయంతో ఇళ్లలోంచి రోడ్ల మీదకు వచ్చేస్తారు. అయితే ఈ లోగానే ఇళ్లు నేలకూలి చాలా మంది చనిపోతుంటారు. మరి భూకంపం వచ్చినప్పుడు ఏం చేస్తే ప్రాణాలకు రక్షణ కలుగుతుంది? ఇదే ప్రశ్నను చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? ఆ సూచనలు తెలుసుకుందాం రండి.
15

భూమి కంపించందంటే పెద్ద పెద్ద భవనాలే నేలమట్టం అయిపోతాయి. ఇక అందులో ఉండే వారు ప్రాణాలతో బయట పడటం చాలా కష్టం. అయితే చాలా మంది ప్రాణ భయంతో పరుగులు పెట్టేస్తారు. ఆ సమయంలో శిథిలాలు మీద పడి ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే భయపడకుండా తెలివితేటలతో ప్రవర్తిస్తే భూకంప తీవ్రత నుంచి బయట పడవచ్చని చాట్ జీపీటీ చెబుతోంది. దానికి ఏం చేయాలో సూచనలు కూడా ఇచ్చింది. అవేంటంటే..
25
భూకంపం వచ్చినప్పుడు ఇలా తప్పించుకోండి
- భూకంపం వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంటే వెంటనే చేతులు, మోకాళ్లపై నేలపైకి వంగండి.
- బలమైన టేబుల్ లేదా డెస్క్ కింద మీ తల, మెడను ఉంచి రక్షణ పొందండి. లేదా చేతులతో కవర్ చేసుకోండి.
- భూమి కంపించడం ఆగే వరకు అలాగే ఉండండి.
- కిటికీలు, అద్దాలు, పడిపోయే ఫర్నీచర్‌కు దూరంగా ఉండండి.
- బయటకు పరిగెత్తకండి. వస్తువులు మీ మీద పడే ప్రమాదం ఉంటుంది.
35
భూకంపం వచ్చినప్పుడు బయట ఉంటే..
- భవనాలు, స్తంభాలు, చెట్లు, విద్యుత్తు తీగలకు దూరంగా ఖాళీ ప్రదేశానికి వెళ్లండి.
- నేలపై వంగి, తల, మెడను రక్షించుకోండి.
- ఒకవేళ మీరు వెహికల్ నడుపుతుంటే సేఫ్ ప్లేస్ లో కారు లేదా బైక్ పార్క్ చేయండి.
- వంతెనలు, ఫ్లైఓవర్లు, సొరంగాలకు దూరంగా పార్క్ చేయండి.
- కంపనం ఆగేవరకు వాహనంలోనే ఉండండి.
45
భూకంపం ఆగిపోయిన తర్వాత ఇలా చేయండి..
- మీకు ఎక్కడైనా గాయాలు అయ్యాయేమో చెక్ చేసుకోండి.
- మీతో ఉన్న వారికి కూడా ఏమైనా గాయాలు అయ్యాయేమో చెక్ చేయండి.
- మీరు దెబ్బతిన్న భవనంలో ఉంటే జాగ్రత్తగా బయటకు వెళ్లండి. లిఫ్ట్‌లను వాడకండి.
- గ్యాస్ లేదా విద్యుత్ లీకేజీ ఉంటే వెంటనే ఆపండి.
- రేడియో, మొబైల్ లేదా ఇంటర్నెట్ ద్వారా అత్యవసర ప్రకటనలు వినండి.
- అత్యవసరమైతేనే ఫోన్ వాడండి.
- ఎందుకంటే ఛార్జింగ్ ఇష్యూ ఉంటుంది. అత్యవసర కాల్స్ మాట్లాడండి.
55
భూకంపం జరిగిన కొన్ని గంటలు లేదా రోజుల తరవాత ఏం చేయాలి..
- మీరున్న ప్రదేశాన్ని ఖాళీ చేయమని అధికారులు అంటే చేయడానికి సిద్ధంగా ఉండండి.
- అవసరమైన వస్తువులు అంటే.. నీరు, ఆహారం, టార్చ్‌లైట్, మందులు, డాక్యుమెంట్లు, డబ్బు, పవర్ బ్యాంక్ ఇలాంటివి దగ్గర పెట్టుకోండి.
- అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి.
- పొరుగువారికి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయండి.
Latest Videos