MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Fancy Vehicle Number : TG 07 R 9999 నంబర్ ప్లేట్ కు ఇంత ధరా..! దీంతో మరో కారే కొనొచ్చు

Fancy Vehicle Number : TG 07 R 9999 నంబర్ ప్లేట్ కు ఇంత ధరా..! దీంతో మరో కారే కొనొచ్చు

అసలు కంటే కొసరే ఎక్కువ అనే సామెత ఈ వ్యవహారానికి సరిగ్గా సరిపోతుంది. ఓ కారు ధరకు కేవలం రిజిస్ట్రేషన్ నంబరే అమ్ముడుపోయింది. హైదరాబాద్ లో ఓ ఫ్యాన్సీ వెహికిల్ నంబర్ లక్షలాది రూపాయలకు వేలంలో అమ్ముడుపోయింది. అంత గొప్ప నంబర్ ఏంటి? ఎంతకు అమ్ముడుపోయింది? ఇక్కడ తెలుసుకుందాం.  

3 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 19 2025, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Expensive Number Plate

Expensive Number Plate

Expensive Number Plate : ఈరోజుల్లో ప్రతిఒక్కటి స్టేటస్ సింబల్ గా మారిపోయింది. తమ స్టేటస్ చూపించుకునేందుకు కొందరు లగ్జరీ ఇళ్లు కట్టుకుంటారు, ఇంకొందరు బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. అయితే ఎక్కువమంది ఖరీదైన లగ్జరీ కార్లతో తమ స్టేటస్ ప్రదర్శిస్తుంటారు... ఇందుకోసం కోట్లు గుమ్మరించి దేశవిదేశాలకు చెందిన కార్లు కొంటారు. ఇంత ఖర్చుచేసి కారు కొన్నాక దాని నంబర్ మామూలుగా ఉంటే ఎలా? అందుకే లక్షలు పోసి ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకుంటున్నారు. ఇలా ఇప్పుడు ఖరీదైన కార్లే కాదు నంబర్ ప్లేట్స్ కూడా స్టేటస్ సింబల్ గా మారిపోయాయి.  

బడాబాబులు ఫ్యాన్సీ నంబర్లపై చూపిస్తున్న ఆసక్తికి ప్రభుత్వం క్యాష్ చేసుకుంటోంది. ఫ్యాన్సీ నంబర్లను ప్రత్యేక వేలంపాట ద్వారా కేటాయిస్తున్నారు. దీంతో స్టేటస్  కోసం కొందరు, న్యూమరాలజీ కోసం మరికొందరు ప్రత్యేకమమైన నంబర్లను కాసులు వెదజల్లి దక్కించుకుంటున్నారు. ఇలా తాజాగా తెలంగాణ రవాణా శాఖ వేలంవేసిన కొన్ని ఫ్యాన్సీ నంబర్లు లక్షల ఆదాయం తెచ్చిపెట్టారు. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆ రిజిస్ట్రేషన్ నంబర్లేంటో పరిశీలిద్దాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Expensive Number Plate

Expensive Number Plate

కారు కాదు నంబర్ ప్లేట్ ధరే రూ.12 లక్షలు : 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని మణికొండ ఆర్టిఏ ఆఫీసులో ఇటీవల ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల వేలంపాట జరిగింది. ఇందులో TG తో కూడిన ఫ్యాన్సీ నంబర్లు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇలా కేవలం ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారానే ఈ ఆర్డిఏ కార్యాలయానికి రూ.52.6 లక్షల ఆదాయం సమకూరింది. 

TG 07 R 9999 రిజిస్ట్రేషన్ నంబర్ అత్యధిక ధర పలికింది. ఈ నంబర్ ను  ఏకంగా రూ.12,49,999 చెల్లించి కొనుగోలుచేసింది ఓ రియల్ ఎస్టేట్ సంస్థ. ఇక TG 07 AA 0009 నంబర్ కు రూ.8.5 లక్షలు, TG 07 AA 0001 నంబర్ కు రూ.4.77 లక్షలు దక్కాయి. ఇలా చాలా నంబర్లను లక్ష రూపాయలకు పైగానే వేలంపాడి దక్కించుకున్నారు. 

హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహించే కాంగ్రూయెంట్ డెవలపర్స్ సంస్థ అత్యధిక ధరకు  TG 07 R 9999 నంబర్ ను దక్కించుకుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఏ వాహనానికి వాడనున్నారో తెలియాల్సి ఉంది. నెంబర్ ప్లేట్ కే ఇంత డబ్బు ఖర్చు చేసారంటే ఖచ్చితంగా ఆ వాహనం కోట్ల విలువచేసేదే అయివుంటుంది. 

ఇక  TG 07 AA 0009 ఫ్యాన్సీ నంబర్ ను హైదరాబాద్ కు చెందిన మరో రియల్ ఎస్టేట్ సంస్థ రుద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. అలాగే TG 07 AA 0001 నంబర్ ను ఫుజి సాప్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ నంబర్లను కూడా ఖరీదైన కార్లకోసమే కొనుగోలు చేసారు. 
 

34
Fancy Number Plate

Fancy Number Plate

దేశంలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఫ్యాన్సీ నంబర్ ఇదే : 

ఇటీవల కేరళలో కూడా ఇలాగా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల వేలంపాట జరిగింది. ఇందులో ఓ ఫ్యాన్సీ నంబర్ కోసం ఓ సంస్థ ఫార్చ్యూనర్, బిఎండబ్ల్యూ , మెర్సిడెస్ బెంజ్ కార్లకంటే ఎక్కువ ధర చెల్లించింది. ఎర్నాకుళం ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో KL 07 DG 0007 నంబర్ ను ఏకంగా రూ. 45 లక్షలు వెచ్చించి దక్కించుకున్నారు.  ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్. 

ఈ ఫ్యాన్సీ నంబర్ KL 07 DG 0007 కు అత్యధిక ధరకు దక్కించుకుంది ఒక ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపనీ.  ఈ నెంబర్ ప్లేట్ ను రూ.4 కోట్లు విలువైన వాహనంకోసం దక్కించుకున్నట్లు సమాచారం. ఇక KL 07 DG 0001 ను పిరవోమ్ నివాసి అయిన థామ్సన్ రూ.25 లక్షలకు దక్కించుకున్నారు.  

44
Fancy Number Plate

Fancy Number Plate

TG నంబర్ ప్లేట్లకు మంచి గిరాకీ : 

తెలంగాణలో బిఆర్ఎస్ పాలన కొనసాగినంతకాలం వాహనాల రిజిస్ట్రేషన్  కోసం TS ఉపయోగించారు... కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ TS స్థానంలో TG ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏదయినా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే TG తో నంబర్ ప్లేట్ వస్తుంది. ఇలా TG తో ప్రారంభమయ్యే ఫ్యాన్సీ నంబర్ల కోసం తెలుగు ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. 

ఇటీవల హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టివో కార్యాలయంలో ఇటీవల ఫ్యాన్సీ నంబర్ల వేలంపాట జరిగింది. ఇందులో పాల్గొన్న సోనీ ట్రాన్స్పోర్ట్స్ సొల్యూషన్ సంస్థ ఏకంగా 25 లక్షల 50 వేల రూపాయలకు TG 09 9999 నంబర్ ను దక్కించుకుంది. ఈ సంస్థ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం కోసం ఈ ఫ్యాన్సీ నంబర్ ను దక్కించుకుంది. 

ఇక ఈ TG సీరీస్ లో మొట్టమొదటి నంబర్ కు కూడా భారీ ధర వచ్చింది. TG 09 0001 నంబర్ ప్లేట్ కు వేలంపాటలో రూ.9 లక్షలకు పైగా దక్కింది. ఇలా టిఎస్ నుండి టిజికి మారాక ఫ్యాన్సీ నంబర్లకు గిరాకీ పెరిగిందని ఆర్టిఓ అధికారులు చెబుతున్నారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
భారతీయ ఆటోమొబైల్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved