Pawan Kalyan: ఊరంతా చెప్పులు పంచిన జనసేనాని.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ సేవలో ఎప్పుడూ ముందుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా సేవా కార్యక్రమాలను చేపట్టేవారు పవన్. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీటిని మరింతి ఎక్కువ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ పవన్ ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

pawan kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనేసన అధినేత పవన్ కళ్యాణ్, పేడపాడు గ్రామంలో ప్రజలు చెప్పులు లేకుండా ఉండటం చూసి, గ్రామస్తులందరికీ చెప్పులు పంపించారు. దీంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పేడపాడు గ్రామంలో దాదాపు 350 మంది నివసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ పని గ్రామస్తులను ఆనందంలో ముంచెత్తింది.
Pawan Kalyan
చెప్పులు పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పేడపాడు గ్రామ ప్రజలకు చెప్పులు పంపించి తన మంచి గుణాన్ని చాటుకున్నారు. ఇటీవల ఆయన అరకు, దుంబిర్గిగూడ ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటన చేశారు. ఈ సందర్భంగా పేడపాడు గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
గ్రామానికి వెళ్ళినప్పుడు, బంగి మిట్టూ అనే వృద్ధ మహిళతో సహా చాలా మంది మహిళలు చెప్పులు లేకుండా ఉండటం ఆయన గమనించారు. దీంతో చలించిపోయిన పవన్ గ్రామంలో ఎంతమంది నివసిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. దాదాపు 350 మంది ఉన్నారని తెలియగానే, వెంటనే తన కార్యాలయ సిబ్బంది ద్వారా అందరికీ చెప్పులు అందేలా ఏర్పాటు చేశారు.
Pawan Kalyan (Photo/ANI)
పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన ప్రజలు:
చెప్పులు అందుకున్న గ్రామస్తులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. "పవన్ సార్ వచ్చి మా కష్టం తెలుసుకున్నారు" అని భావోద్వేగానికి లోనయ్యారు. ఇతర నాయకులెవరూ తమ సమస్యలను పట్టించుకోలేదని, ఉప ముఖ్యమంత్రి గ్రామానికి వచ్చి తమ కష్టాలు తీర్చినందుకు రుణపడి ఉంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు రిజర్వేషన్ సవరణ బిల్లుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఆధునికీకరించే ఈ బిల్లుకు మద్దతుగా ఓటు వేయాలని పార్టీ పార్లమెంటు సభ్యులకు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ ఆదేశించారు.
AP Deputy CM Pawan Kalyan, janasena, Pawan Kalyan
జనసేన విడుదల చేసిన ప్రకటనలో.. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు జనసేన పార్టీ మద్దతు తెలియజేస్తుంది. ఈ సవరణ ముస్లిం సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుందని పార్టీ విశ్వసిస్తోంది. అందువల్ల, ఈ బిల్లుకు అందరూ మద్దతుగా ఓటు వేయాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశించారు అని పేర్కొన్నారు.
Pawan Kalyan
వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకురావడంపై 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేసింది. సంబంధిత వర్గాలతో, పండితులతో, పరిపాలనా నిపుణులతో చర్చించిన తర్వాత ఈ బిల్లును రూపొందించారు. బ్రిటిష్ కాలంలో రూపొందిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చి, మరింత ప్రయోజనాలు చేకూర్చడానికి ఈ సవరణ ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.