MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • DC vs GT: జోస్ బట్లర్ ప‌రుగుల తుఫాను.. చివరి ఓవర్ లో ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్ట‌రీ కొట్టిన గుజ‌రాత్

DC vs GT: జోస్ బట్లర్ ప‌రుగుల తుఫాను.. చివరి ఓవర్ లో ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్ట‌రీ కొట్టిన గుజ‌రాత్

DC vs GT: ఐపీఎల్ 2025లో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు గుజ‌రాత్ టైటాన్స్ షాక్ ఇచ్చింది. జోస్ బ‌ట్ల‌ర్ సూపర్ నాక్ తో చివ‌రి ఓవ‌ర్ లో శుభ్ మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలోని గుజ‌రాత్ జ‌ట్టు అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ జ‌ట్టుపై థ్రిల్లింగ్ విక్ట‌రీ అందుకుంది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 19 2025, 09:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
IPL 2025: Gujarat Titans vs Delhi Capitals

IPL 2025: Gujarat Titans vs Delhi Capitals

Delhi Capitals vs Gujarat Titans: ఐపీఎల్ 2025లో మ‌రో థ్రిల్లింగ్ మ్యాచ్ జ‌రిగింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగుతూ క్రికెట్ ల‌వ‌ర్స్ కు మ‌స్తు మ‌జాను అందించింది. అదే ఐపీఎల్ 2025 35వ మ్యాచ్‌. ఇందులో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
IPL 2025: Gujarat Titans vs Delhi Capitals

IPL 2025: Gujarat Titans vs Delhi Capitals

గుజరాత్ విజ‌యంలో హీరోగా నిలిచాడు జోస్ బట్లర్. అద్భుత‌మైన 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో త‌న జ‌ట్టుకు విజ‌యాన్నిఅందించాడు. ఈ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 203 ప‌రుగులు చేసింది. ఆ టీమ్ లోని ప్లేయ‌ర్లు స‌మిష్టిగా రాణించ‌డంతో డ‌బుల్ సెంచ‌రీ స్కోర్ ను సాధించింది.  

204 పరుగుల టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు రెండో ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 7 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే, మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జోస్ బట్లర్ క్రీజులో కుదురుకున్న తర్వాత దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. 

34
IPL 2025: Gujarat Titans vs Delhi Capitals

IPL 2025: Gujarat Titans vs Delhi Capitals

మొదట సాయి సుదర్శన్ (36)తో, ఆ తర్వాత షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (43)తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి గుజరాత్ విజయానికి పునాది వేశాడు. చివరి వరకు క్రీజులో ఉండి జీటీకి విజయాన్ని అందించాడు. జోస్ బట్లర్ తన 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అద్భుతమైన నాక్ ఆడిన బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

చివరి ఓవర్ లో ఉత్కంఠ  

19వ ఓవర్ 5వ బంతికి బాగా బ్యాటింగ్ చేస్తున్న షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను ముఖేష్ కుమార్ క్యాచ్ అవుట్ చేయడంతో గుజరాత్ అభిమానుల్లో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా  సింగిల్ తీసుకొని చివరి ఓవర్‌లో స్ట్రైక్‌ను కొనసాగించాడు. గుజరాత్ గెలవడానికి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం. 

44

మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్ మొదటి బంతికే తెవాటియా సిక్స్ కొట్టి, మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ చేతిలోకి తీసుకువచ్చాడు. తర్వాతి బంతికి విన్నింగ్ ఫోర్ కొట్టడం గుజరాత్ విజయం సాధించింది. తెవాటియా 3 బంతుల్లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్ల చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. 

ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్  

గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ను తన బౌలింగ్ తో వణికించాడు. కీలకమైన నాలుగు వికెట్లు తీసుకున్నాడు.  సీనియర్ స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇషాన్ తన మూడు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
శుభ్‌మన్ గిల్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Recommended image2
IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?
Recommended image3
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved