Recharge plan: రూ. 100కే 30 రోజుల వ్యాలిడిటీ.. జియో హాట్ స్టార్‌తో పాటు..
ప్రస్తుతం టెలికం రంగంలో భారీగా పోటీ పెరిగింది. దీంతో టెలికం కంపెనీలు రకరకాల ప్లాన్స్ తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా డేటా వినియోగం పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో ఇంటర్నెట్ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ టెల్ యూజర్ల కోసం ఒక ఆకర్షణీయమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా టెలికం కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీల విస్తృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో ఓటీటీతో కూడిన ప్లాన్స్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్‌లటెల్ ఒక మంచి ప్లాన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ప్లాన్‌తో ఎక్కువ రోజులు జియో హాట్ స్టార్ యాక్సెస్ చేసుకునే ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
ఎయిర్‌టెల్ రూ. 100 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు 5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఇందులో ఎలాంటి టాక్ టైమ్ రాదు. ఇది కేవలం డేటా ఓచర్ మాత్రమే. ఎలాంటి మెసేజ్‌లు కూడా రావు.
అలాగే ఈ ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్ స్టార్ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ఏదో ఒక యాక్టివ్ ప్లాన్ ఉండాలి. ఇది కేవలం డేటా వోచర్‌గా మాత్రమే పనిచేస్తుంది.
ఐపీఎల్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చారని చెప్పాలి. అదనపు డేటాతో పాటు జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా పొందొచ్చు. ఇక అప్పటికే వైఫై కనెక్షన్ ఉన్న వారికి కూడా ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. డేటాతో పాటు హాట్ స్టార్ యాక్సెస్ కూడా పొందొచ్చన్నమాట.