- Home
- National
- క్లాస్ మేట్ తో డిల్లీ మాజీ సీఎం కూతురు లవ్ మ్యారేజ్ ... కేజ్రీవాల్ అల్లుడు ఏం చేస్తాడో తెలుసా?
క్లాస్ మేట్ తో డిల్లీ మాజీ సీఎం కూతురు లవ్ మ్యారేజ్ ... కేజ్రీవాల్ అల్లుడు ఏం చేస్తాడో తెలుసా?
డీల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది. తన క్లాస్ మేట్ తో ఇంతకాాలం ప్రేమలో కొనసాగిన హర్షిత కేజ్రీవాల్ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. మరి హర్షిత కు సంభవ్ జైన్ ఎలా పరిచయం? ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? ఇప్పుడు హర్షిత, వైభవ్ ఏం చేస్తున్నారు? తెలుసుకుందాం.

Harshita Kejriwal-Sambhav Jain marriage
డిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూతురు వివాహం దేశ రాజధానిలో అట్టహాసంగా జరిగింది. ఐఐటి చదివే సమయంలో పరిచయం అయితే స్నేహితుడిని హర్షిత ఇష్టపడింది. వీరిద్దని ప్రేమను అంగీకరించిన కేజ్రీవాల్ అంగరంగవైభవంగా పెళ్లిచేసాడు. ఇలా హర్షిత, సంభవ్ జైన్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి.
ఢిల్లీలోని ఫైవ్ స్టార్ కపుర్తలా హౌస్ లో జరిగిన ఈ పెళ్లికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి గోపాల్ రాయ్ తో పాటు కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. బాలీవుడ్ గాయకుడు మీకా సింగ్ తో పాటు మరికొందరు ప్రముఖులు హర్షిత-సంభవ్ పెళ్లికి వచ్చారు. ఇలా పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఈ పెళ్లి వేడుకల్లో కేజ్రీవాల్ దంపతులు డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేజ్రీవాల్, సునీత దంపతులు అల్లు అర్జున్ 'పుష్ఫ2' సినిమాలోని పాటకు స్టెప్పులేసారు. స్టేజీపై వీరిద్దరు డ్యాన్స్ చేస్తుంటే అక్కడున్నవారు కేరింతలతో ఉత్సాహపరిచారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కేజ్రీవాల్ ఇంట పెళ్లిలో స్టెప్పులేసారు. ఇలా డిల్లీ మాజీ సీఎం, పంజాబ్ సీఎంల డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Harshita Kejriwal
హర్షిత కేజ్రీవాల్ ఏం చేస్తుంది?
హర్షిత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్, సునీత దంపతులకు కూతురు హర్షిత, కొడుకు పుల్కిత్ సంతానం. కేజ్రీవాల్ మాదిరిగానే ఆయన ఇద్దరు పిల్లలు ఐఐటియన్లే. పెద్దకూతురు హర్షిత ఇప్పటికే ఐఐటి డిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసింది...పుల్కిత్ ప్రస్తుతం ఇదే ఐఐటీలో చదువుకుంటున్నాడు.
ఐఐటీ ఢిల్లీలో చదువుతున్నప్పుడే హర్షితకు సంభవ్ జైన్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ జీవితంలో స్థిరపడటంతో పెద్దలు కూడా వీరి ప్రేమను కాదనలేకపోయారు. ఇలా పెద్దలను ఒప్పించి హర్షిత, సంభవ్ పెళ్లి చేసుకున్నారు.
ఐఐటీ తర్వాత హర్షిత ఉద్యోగంలో చేరిపోయారు. గురుగ్రామ్ లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో అసోసియేట్ కన్సల్టెంట్ గా పనిచేసారు. అలాగే కాబోయే భర్తతో కలిసి ఓ స్టార్టప్ ను కూడా స్థాపించారు. ప్రస్తుతం ఇది సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.
కేవలం చదువులోనే కాదు ఇతర విషయాల్లోనూ హర్షిత బాగా చురుకు. ఆమె ఒడిస్సి నాట్యం నేర్చుకుంది. ఇక హింది,ఇంగ్లీష్ తో పాటు ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడగలరు. ఇవి కాకుండా రాజకీయాల్లోనూ తండ్రికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల ఆప్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం కూడా చేపట్టారు.
Sambhav Jain
ఎవరీ సంభవ్ జైన్?
హర్షితతో పాటే డిల్లీ ఐఐటీలో చదువుకున్నారు వైభవ్. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇప్పుడు పెళ్లి వరకు చేరుకుంది. సంభవ్ జైన్ ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
హర్షిత, సంభవ్ కలిసి 'బాసిల్ హెల్త్' అనే స్టార్టప్ కంపెనీని కూడా స్థాపించారు. హర్షిత కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కోసం తాను పడిన కష్టాల నుంచి నేర్చుకుని, ఇటీవల సంభవ్ జైన్‌తో కలిసి 'బాసిల్ హెల్త్' అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించింది. ఈ స్టార్టప్ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది దీని లక్ష్యం.