MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఆహా.. ఇకపై ఇన్‌స్టాలో ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్ చూడొచ్చు.. కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలంటే..

ఆహా.. ఇకపై ఇన్‌స్టాలో ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్ చూడొచ్చు.. కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలంటే..

Instagrams New Blend Feature: ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ‘బ్లెండ్’ అనే ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు మీ ఫ్రెండ్స్‌తో కలిసి మీకు నచ్చిన రీల్స్ చూడొచ్చు. షేర్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టాయిష్టాలను బట్టి రీల్స్ సెలెక్ట్ చేసి ఇన్‌స్టా మీకు చూపిస్తుంది. గ్రూప్ చాట్‌లో కూడా ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 19 2025, 08:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మనలో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ షేర్ చేసే అలవాటు ఉంటుంది కదా.. ఎవరికి నచ్చిన రీల్స్ వారి ఫ్రెండ్స్ కి రోజూ పంపిస్తూనే ఉంటాం. దీంతో చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. ప్రతి రీల్ షేర్ చేస్తున్నారేమిట్రా అని చిరాకు పడుతుంటాం. ఇకపై ఇలాంటి అవస్థలు లేకుండా ఇన్‌స్టాగ్రామ్  కొత్తగా ‘బ్లెండ్’ అనే ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రత్యేకతలేంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

సోషల్ మీడియాలో కొత్త కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ‘బ్లెండ్’ అనే ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ బ్లెండ్ ఫీచర్ లో మీరు మీకు నచ్చిన ఫ్రెండ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. దీంతో మీరంతా ఒక గ్రూప్ లా ఏర్పడతారు. గ్రూప్ లో చేరిన వారికి నచ్చిన వీడియోలను ఇన్ స్టాగ్రామ్ చూపిస్తుంది. 

34

ఇన్‌స్టాగ్రామ్ ‘బ్లెండ్’ ఫీచర్ స్పెషాలిటీ ఏంటంటే.. మీరు, మీ ఫ్రెండ్స్ ఇష్టపడే రీల్స్ ఒకే చోట చూడొచ్చు. 

బ్లెండ్‌ని స్టార్ట్ చేయడానికి మీరు చాట్ ఓపెన్ చేసి, బ్లెండ్ సింబల్ క్లిక్ చేయాలి.

ఫ్రెండ్స్‌ని యాడ్ చేసుకోవాలి. 

బ్లెండ్‌లో జాయిన్ అయ్యాక, మీ అందరి ఇష్టాలను బట్టి రీల్స్ కనిపిస్తాయి. 

వాటిని క్లిక్ చేయడం ద్వారా మీ గ్రూప్ లో ఉన్న వారంతా ఒకేసారి రీల్స్ చూడొచ్చు. 

44

మీ గ్రూప్‌లో ఉన్న ఎవరైనా వీడియోకి లైక్, కామెంట్ చేస్తే నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈజీగా చాట్ కూడా చేసుకోవచ్చు. 

బ్లెండ్ నుంచి బయటకు రావాలంటే మెసెంజర్ ఐకాన్ క్లిక్ చేసి, చాట్ సెలెక్ట్ చేసి, ‘Leave this Blend’ క్లిక్ చేయాలి. 

ఇన్‌స్టాగ్రామ్ లో కొత్తగా వచ్చిన ఈ బ్లెండ్ ఫీచర్ ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్ చూడటాన్ని సరదాగా మారుస్తుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Recommended image2
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Recommended image3
90 శాతం మందికి ఇది తెలియ‌దు.. CNG కొట్టిచ్చేప్పుడు ప్ర‌యాణికుల‌ను ఎందుకు దిగ‌మంటారు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved