MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?

40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?

బాలీవుడ్ స్టార్ హీరో నటించిన 40 సినిమాలు ప్లాప్ అయ్యాయి, 33 సినిమాలు రిలీజ్ కాలేదు. మూవీ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పేస్ చేసిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 19 2025, 11:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సునీల్ శెట్టిని బాలీవుడ్‌లో 'అన్నా' అని కూడా పిలుస్తారు. నటన, స్టైల్, డైలాగ్ డెలివరీకి పేరున్న సునీల్ శెట్టిని ఇతర నటులకంటే కాస్త  భిన్నంగా ఆలోచిస్తారు. ఆయన జిమ్ బాడీ, , అద్భుతమైన యాక్షన్, డైలాగులు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సునీల్ శెట్టి సినిమా  స్టార్ గా ఉన్నారు కాని.. అసలు ఆయన  చిన్నప్పుడు క్రికెటర్ కావాలనుకున్నారట. సినిమాల్లో స్థానం సంపాదించడం సులభం కాదని, ఇడ్లీలు అమ్ముకోవడం మేలని ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు స్టార్ హీరో.

39

కెరీర్ ప్రారంభంలో సునీల్ శెట్టి లుక్ కారణంగా చాలా తిరస్కారాలు ఎదుర్కొన్నారు. ఏ దర్శకుడూ అవకాశం ఇవ్వలేదు, ఏ హీరోయిన్ జత కట్టలేదు. సినిమాలు ఆయనకు చేతకావని దర్శకులు అన్నారట. 

49

1992లో 'బల్వాన్' సినిమాతో సునీల్ శెట్టి కెరీర్ మొదలైంది. 1994లో వచ్చిన 'మొహ్రా' ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. తర్వాత 'గోపి కిషన్'లో డబుల్ రోల్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

59

‘యే తేరా ఘర్ యే మేరా ఘర్’, ‘హేరా ఫేరీ’, ‘దే దనా దాన్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 2001లో వచ్చిన 'ధడ్కన్' సినిమాకు ఉత్తమ విలన్ అవార్డు అందుకున్నారు. సునీల్ శెట్టి ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించారు.

69

ఇన్ని సినిమాలు చేసిన సునీల్ శెట్టికి 40 సినిమాలు ప్లాప్ అయ్యాయి, 33 సినిమాలు రిలీజ్ కాలేదు. అయినా 90ల దశకంలో టాప్ హీరోలలో ఒకరు. ఇక  ఆయన ఆస్తి 125 కోట్లు ఉంటుందని అంచన.

79

సునిల్ శెట్టిప్రేమ వివాహం చాలా చిత్రంగా జరిగింది. సునిల్ ప్రేమించిన అమ్మాయి  మాన. ఆమె తండ్రి గుజరాతీ ముస్లిం, తల్లి పంజాబీ. సునీల్ శెట్టిది కర్ణాటక తుళు కుటుంబం. దాంతో వీరి పెళ్ళికి సంస్కృతి, మతం, కులం అడ్డుగా నిలిచాయి. రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ సునీల్, మాన ప్రేమను వదులుకోలేదు.

89

ఇరు కుటుంబాలు పెళ్ళికి ఒప్పుకునేవారకూ  సునీల్, మానలు వెయిట్ చేశారు. ఇక వారి ప్రేమ బంధాన్ని చూసి వారి పెద్దలు వెంటనే  పెళ్లికి ఒప్పుకున్నారు. 9 ఏళ్ల తర్వాత 1991 డిసెంబర్ 25న పెళ్లి జరిగింది.

99

సునీల్ శెట్టి వృత్తి కంటే వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వార్తల్లో ఉంటారు. ఆయన పూర్తిగా కుటుంబానికి అంకితమైన వ్యక్తి. ఎక్కువగా కుటుంబంతో సమయం గడుపుతారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Recommended image2
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Recommended image3
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved