KL Rahul: సిక్సర్ల డబుల్ సెంచరీ.. ధోని, కోహ్లీ, రోహిత్ లను దాటవేసిన కేఎల్ రాహుల్
Fastest Indian to 200 IPL sixes: ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్‌లో 138 మ్యాచ్‌లు ఆడి 4,949 పరుగులు చేశాడు. 45.82 సగటు, 135 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో తన ఆటను కొనసాగించాడు. ఈ క్రమంలోనే సిక్సర్లతో డబులు సెంచరీ కొట్టాడు. ధోని, కోహ్లీ, రోహిత్ శర్మలను అధిగమించాడు.

KL Rahul Smashes Record: Fastest Indian to Hit 200 IPL Sixes
Fastest Indian to 200 IPL sixes: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే భారత దిగ్గజ ప్లేయర్లు ఎంస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు సాధ్యం కాని మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Rahul’s Power Show: Becomes Fastest Indian to 200 Sixes in IPL History
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 ఎడిషన్ ను అద్భుతంగా ప్రారంభించాడు. సూపర్ నాక్ లతో అదరగొడుతున్నాడు. క్రమంలోనే కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో సిక్సర్ల డబుల్ సెంచరీ కొట్టాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 35వ మ్యాచ్‌లో కేఎల్ ఒక సిక్సర్ ను కొట్టడంతో ఐపీఎల్ లో 200 సిక్సర్లు పూర్తి చేశాడు.
Six-Hitting Machine: KL Rahul Joins Elite 200 IPL Sixes Club in Style
ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే బౌలర్లపై దాడి చేస్తూ పవర్‌ప్లే ఓవర్లలో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. అయితే, దానిని మరో పెద్ద ఇన్నింగ్స్ గా మార్చలేకపోయాడు. 5వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రాహుల్ 14 బంతుల్లో 28 పరుగుల తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు.
KL Rahul Enters History Books with 200 IPL Sixes, Surpasses Dhoni, Kohli & Rohit
ఐపీఎల్ లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్
ఈ మ్యాచ్ లో ఒక సిక్సర్ కొట్టడంతో ఐపీఎల్‌లో 200 సిక్సర్లు పూర్తి చేసిన 11వ బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ ఘనత సాధించాడు. అలాగే, ఐపీఎల్ లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారత ప్లేయర్ గా కేఎల్ రాహుల్ రికార్డు సాధించాడు. కేవలం 129 ఇన్నింగ్స్‌లలో 200 ఐపీఎల్ సిక్సర్లను పూర్తి చేశాడు.
ఈ సిక్సర్ల రికార్డులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి భారత బ్యాట్స్‌మెన్‌లను వెనక్కి నెట్టాడు. రాహుల్ కాకుండా 150 ఇన్నింగ్స్‌లలోపు ఏ భారత బ్యాట్స్ మెన్ కూడా 200 సిక్సర్లను పూర్తి చేయలేదు. మొత్తంగా వేగవంతమైన 200 సిక్సర్ల రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ కేవలం 66 ఇన్నింగ్స్ లలోనే 200 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆండ్రీ రస్సెల్ 97 ఇన్నింగ్స్ లలో 200 సిక్సర్లను పూర్తి చేశాడు.
Rahul Makes History: Third Fastest Ever to Hit 200 Sixes in IPL
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్లు
క్రిస్ గేల్ – 69 ఇన్నింగ్స్ లు
ఆండ్రీ రస్సెల్ - 97
కేఎల్ రాహుల్ - 129
ఏబీ డివిలియర్స్ - 137
డేవిడ్ వార్నర్ - 148
వేగంగా ఐపీఎల్‌లో 200 సిక్సర్లు పూర్తి చేసిన భారత బ్యాట్స్‌మన్
కేఎల్ రాహుల్ – 129 ఇన్నింగ్స్ లు
సంజూ శాంసన్- 159
ఎంఎస్ ధోని - 165
విరాట్ కోహ్లీ - 180
రోహిత్ శర్మ - 185
కేఎల్ రాహుల్ ఐపీఎల్ కెరీర్ గమనిస్తే.. 138 మ్యాచ్ లు ఆడి 46.25 సగటు, 135.73 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 4949 పరుగులు సాధించాడు. అలాగే, ఐపీఎల్ లో 39 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు బాదాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటివరకు 53.20 సగటుతో 266 పరుగులు చేశాడు.