MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: 14 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. తొలి బంతికే సిక్సర్.. రికార్డుల మోత మోగిస్తున్న వైభవ్ సూర్యవంశీ

IPL 2025: 14 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. తొలి బంతికే సిక్సర్.. రికార్డుల మోత మోగిస్తున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi IPL Debut: 14 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి బంతినే సిక్సర్ బాది అదిరిపోయే అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే సూపర్ నాక్ తో అదరగొట్టాడు. అతనే రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. 

2 Min read
Mahesh Rajamoni
Published : Apr 19 2025, 10:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
IPL entry at 14 years old.. Six on the first ball.. Vaibhav Suryavanshi breaks records

IPL entry at 14 years old.. Six on the first ball.. Vaibhav Suryavanshi breaks records

Vaibhav Suryavanshi IPL Debut: ఐపీఎల్ 2025 36వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్-లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి.  ఈ మ్యాచ్ లో బిగ్ డెసిషన్ తీసుకుంటూ రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల కుర్రాడైన వైభవ్ సూర్యవంశీ కి ప్లేయింగ్ 11 లో చోటుకల్పించింది. దీంతో జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్య వంశీ..  మెగా క్రికెట్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్ ను ఆడాడు. 

యశస్వి జైస్వాల్ తో కలిసి రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్  కొట్టాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన బంతిని కవర్స్ మీదుగా సూపర్ సిక్సర్ కొట్టాడు. దీంతో ఐపీఎల్ అరంగేట్రంలోనే తొలి బంతికే సిక్సర్ కొట్టిన ప్లేయర్ గా, అలాగే ఐపీఎల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన అతిపిన్న వయస్కుడైన ప్లేయర్ గా నిలిచాడు. తన తొలి మ్యాచ్ లో 170 స్ట్రైక్ రేటుతో 34 పరుగుల ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. 
  

24
Vaibhav Suryavanshi: The 14 Year-Old Prodigy Who Made IPL History

Vaibhav Suryavanshi: The 14 Year-Old Prodigy Who Made IPL History

ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ రికార్డులు 

ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ ఘనత సాధించాడు. ఐపీఎల్ లో తన మొదటి మ్యాచ్ ఆడుతున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ వయస్సు 14 సంవత్సరాల 23 రోజులు. అంతకుముందు అతిపిన్న వయస్కుడైన ఐపీఎల్ ప్లేయర్ రికార్డును కలిగి వున్న ప్రయాస్ రే బర్మాన్ రికార్డును బద్దలు కొట్టాడు. 2019లో 16 సంవత్సరాల 157 రోజుల వయసులో బర్మాన్ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. 

ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కులు వీరే:

14 సంవత్సరాలు 23 రోజులు - వైభవ్ సూర్యవంశీ, 2025
16 సంవత్సరాలు 157 రోజులు - ప్రయాస్ రే బర్మాన్, 2019
17 సంవత్సరాలు 11 రోజులు - ముజీబ్ ఉర్ రెహమాన్, 2018
17 సంవత్సరాలు 152 రోజులు - రియాన్ పరాగ్, 2019
17 సంవత్సరాలు 179 రోజులు - ప్రదీప్ సాంగ్వాన్, 2008

34
India’s Youngest IPL Signing: Vaibhav Suryavanshi’s Inspirational Story

India’s Youngest IPL Signing: Vaibhav Suryavanshi’s Inspirational Story

ఎవరీ వైభవ్ సూర్యవంశీ?

వైభవ్ సూర్యవంశీ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా, తాజ్‌పూర్‌లో జన్మించాడు. తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక రైతు, పార్ట్‌టైమ్ జర్నలిస్టు. ఏడేళ్ల వయసులోనే తండ్రి దగ్గర క్రికెట్ పాఠాలు మొదలుపెట్టాడు. ఎనిమిదేళ్లకే అండర్-16 జిల్లా ట్రయల్స్‌కు ఎంపికై తన ప్రయాణాన్ని ప్రారంభించిన వైభవ్, 10 ఏళ్ల వయసులో సీనియర్లతో కలిసి ఆడుతూ తన ప్రతిభను చాటాడు. కేవలం 12 ఏళ్ల వయసులో బీహార్ అండర్-19 జట్టుకు ఎంపికై వినూ మన్కడ్ ట్రోఫీలో మంచి ప్రదర్శన ఇచ్చాడు.

44
From Bihar to the Big League: Vaibhav Suryavanshi’s Meteoric Rise to IPL 2025

From Bihar to the Big League: Vaibhav Suryavanshi’s Meteoric Rise to IPL 2025

జనవరి 2024లో రంజీ ట్రోఫీలో బీహార్ తరఫున అరంగేట్రం చేసిన రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. 12 సంవత్సరాల 284 రోజుల వయసులో ముంబైతో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. అక్టోబర్ 2024లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 58 బంతుల్లో సెంచరీ కొట్టి వైభవ్ సూర్యవంశీ సంచలనం రేపాడు. ఇది భారత అండర్-19 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.

చెన్నైలో జరిగిన యూత్ టెస్ట్‌లో 62 బంతుల్లో 104 పరుగులతో సూపర్ నాక్ ఆడాడు. ఆసియా కప్ సెమీఫైనల్‌లో శ్రీలంకపై 67 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనలతో 2025 ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ వైభవ్‌ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో కాంట్రాక్ట్ పొందిన ఆటగాడిగా నిలిచాడు. 

About the Author

Mahesh Rajamoni
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved