- Home
- Life
- Beauty Tips: ఇంట్లో టమాట ఉంటే చాలు పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు.. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది
Beauty Tips: ఇంట్లో టమాట ఉంటే చాలు పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు.. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది
ఇటీవల చాలా మందిలో ఆరోగ్యంతో పాటు అందంపై కూడా మక్కువ పెరుగుతోంది.మహిళలతో సమానంగా పురుషులు సైతం బ్యూటీ పార్లర్‌లకు క్యూ కడుతున్నారు. అయితే బ్యూటీ పార్లర్‌లకు వెళ్లడం అనేది ఖర్చుతో కూడుకున్న అంశం. అయితే ఇంట్లో దొరికే నేచురల్ వస్తువులతోనే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని మీకు తెలుసా.? అలాంటి వాటిలో టమాట ఒకటి. టమాట ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం. ఇంతకీ టమాట ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యూటీ పార్లర్‌లో ఉపయోగించే ప్రొడక్ట్స్‌లో ఎంతో కొంత రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అయితే నేచురల్‌గా లభించే టమాటతో చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. టమాటలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, సహజ ఆమ్లాలు మీ చర్మాన్ని కాపాడుతాయి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే టమాటాలతో తయారు చేసిన ప్రత్యేక ఫేస్ ప్యాక్‌ను బాగా ఉపయోగపడతాయి.
మీ బుగ్గలు టమోటాల లాగా ఎర్రగా, గులాబీ రంగులోకి మారాలనుకుంటే, ఈ ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి. మీరు దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. టమాటను ఎన్నో ఏళ్లుగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా దానిని శుభ్రంగా, యవ్వనంగా ఉంచుతుంది.
tomato face pack
టమాట ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 టమోటా, 1 టీస్పూన్ తేనె, 1 చిటికెడు పసుపు, 1 టీస్పూన్ నిమ్మరసం.
ఫేస్ ప్యాక్ తయారీ విధానం:
ముందుగా తాజా టమోటాను బాగా కడిగి తొక్క తీయండి. ఇప్పుడు దాన్ని గుజ్జును వేరు చేసి మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోండి. అనంతరం అందులో ఒక టీస్పూన్ తేనె, చిటికెడు పసుపు కలపండి. తేనె చర్మానికి తేమను, మెరుపును ఇస్తుంది, పసుపు సహజ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
Tomato Face Pack Benefit
ఇక ఒకవేళ మీ చర్మం జిడ్డుగా ఉంటే నిమ్మరసం కూడా కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నుదిటిపై, బుగ్గలపై బాగా అప్లై చేయండి. కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి. ఇలా 20 నుంచి 30 నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
tomato facepack
టమాట ఫేస్ ప్యాక్ ఉపయోగాలు:
టమాటలో సహజ ఆమ్లాలు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మపు రంగును కాంతివంతం చేస్తాయి, మెరిసేలా చేస్తాయి. ఇది చర్మానికి గులాబీ రంగును ఇస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలను
చర్మపు మచ్చలను కాంతివంతం చేయడంలో సహాయపడతాయి.
tomato facepack
ఇది మొటిమలను కూడా తగ్గించడంలో ఉపయోగపడతాయి. టమోటాలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి సాఫ్ట్‌గా చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో టమాట ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది. చర్మం వడదెబ్బకు గురైతే, టమోటా ఫేస్ ప్యాక్ మీకు ఉపశమనం కలిగిస్తుంది. చికాకు తగ్గడంతో పాటు చర్మం చల్లబడుతుంది.