MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Fastest century : ఫస్ట్ ఓవర్ 33, సెకండ్ ఓవర్ 40, థర్డ్ ఓవర్ 27 పరుగులు ... మూడు ఓవర్లలో సెంచరీ ఏంటి సామీ!

Fastest century : ఫస్ట్ ఓవర్ 33, సెకండ్ ఓవర్ 40, థర్డ్ ఓవర్ 27 పరుగులు ... మూడు ఓవర్లలో సెంచరీ ఏంటి సామీ!

ప్రస్తుతం టీ20 ఫార్మాట్ క్రికెట్లో అలవోకగా సెంచరీలు నమోదవుతున్నాయి. అతి తక్కువ బంతుల్లో అత్యధిక పరుగులు చేయడం ఆటగాళ్లకు అలవాటుగా మారిపోయింది. కానీ ఆనాటి టెస్ట్ క్రికెట్ జమానాలో కేవలం 3 ఓవర్లలో సెంచరీ రికార్డు నమోదయ్యిందంటే మీరు నమ్మగలరా? అయితే మీకు ఈ సూపర్ ఇన్నింగ్స్ గురించి తెలియాల్సిందే.. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 19 2025, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Fastest century

Fastest century

Don Bradman Fastest century : ప్రస్తుత టీ20 జమానాలో ఏదయినా సాధ్యమే... క్రికెట్ చాలా ఫాస్ట్ అయిపోయింది. కేవలం 15-20  బంతుల్లో హాఫ్ సెంచరీ... 30-40 బంతుల్లో సెంచరీలు నమోదవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అయితే ధనాధన్ బ్యాటింగ్ తో పరుగులు వరద పారించే ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు... ఇప్పటికే కొందరు అతి తక్కువ బంతుల్లో సెంచరీ మోత మోగించారు. కేవలం 20 ఓవర్లలో ఓ జట్టు 300 పరుగులు చేయగలదన్న నమ్మకం వచ్చిందంటే ఐపిఎల్ లో హిట్టింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 

అయితే టీ20 లే కాదు క్రికెట్ ఫార్మాట్ ఎంత మారినా ఓ రికార్డును మాత్రం అస్సలు బద్దలుగొట్టే అవకాశం లేదు. ఎంత గొప్ప హిట్టర్ అయినా కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ చేయడం అసాధ్యం. ఈ ఫీట్ ను మన స్వాతంత్య్రానికి ముందే అంటే 1931 లో సాధించాడో క్రికెటర్. ఇంతటి అద్భుత ఆటగాడు ఎవరు? మూడు ఓవర్లలోనే సెంచరీ అంటే ఆ విధ్వంసం ఎలా సాగింది? ఇక్కడ తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Fastest century

Fastest century

బ్రాడ్ మాన్ రికార్డ్ : 

క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు సర్ బ్రాడ్ మాన్. ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతడు ఈ తరానికి తెలియకపోవచ్చు... ముందుతరం క్రికెట్ అభిమానుల్లో ఈ పేరు తెలియవారు ఉండరు. సచిన్ టెండూల్కర్, గంగూలీ లాంటి దిగ్గజాలు సైతం బ్రాడ్ మాన్ ఆటను చూస్తూ పెరిగినవాళ్లే. 

ఈ క్రికెట్ దిగ్గజం పేరిట అనేక ప్రపంచ రికార్డులు ఉన్నాయి. ఈ ధనాధన్ క్రికెట్ వచ్చాక కొన్ని రికార్డులు బద్దలయ్యాయి... కానీ 1931 లో అతడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ను ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎవరు బద్దలుగొట్టలేరు. ఆ టెస్ట్ క్రికెట్ జమానాలోనే టీ20 నే తలదన్నేలా ఆడాడు బ్రాడ్ మాన్. కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ కొట్టడమంటే మామూలు విషయమా. 

1931 లో ఆస్ట్రేలియా దేశవాళి క్రికెట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు బ్రాడ్ మాన్.  లిత్ గో పాటరీ XI తో జరిగిన మ్యాచ్ లో బ్లాక్‌హీత్ XI తరపున బరిలోకి దిగిన బ్రాడ్ మాన్ సెంచరీతో చెలరేగాడు. ఇప్పట్లా కాకుండా ఆ కాలంలో ఓవర్ కు 8 బంతులు వేయాల్సి ఉండేది. ఇలా 3 ఓవర్లలో అంటే 24 బంతుల్లోనే సెంచరీ బాది సరికొత్త రికార్డు నెలకొల్పాడు బ్రాడ్ మాన్. మాల్థాయిడ్ పిచ్ ఈ అద్భుత ఆటకు వేదికయ్యింది. 

క్రీజులోకి అడుగు పెడుతూనూ జూలు విదిల్చాడు బ్రాడ్ మాన్. బ్లాక్ వేసిన మొదటి ఓవర్లో 33 పరుగులు (6,6,4,2,4,4,6,1)  రాబట్టాడు బ్రాడ్ మాన్. ఆ తర్వాత ఓవర్లో మరింత రెచ్చిపోయాడు... బేకర్ వేసిన ఈ ఓవర్లో ఏకంగా 40 పరగులు (6,4,4,6,6,4,6,4) రాబట్టాడు. మళ్ళీ బ్లాక్ బౌలింగ్ వేయగా ఇందులో 27 పరుగులు (1,6,6,1,1,4,4,6) చేసారు. ఇందులో రెండు సింగిల్స్ మరో బ్యాట్ మెన్ చేసినవి. ఇలా కేవలం మూడు ఓవర్లలోనే సెంచరీ బాది అరుదైన రికార్డు సాధించాడు బ్రాడ్ మాన్. 

ఈ మ్యాచ్ లో ఏకంగా 14 సిక్సర్లు, 29 ఫోర్లలో 256 పరుగులు చేసాడు బ్రాడ్ మాన్. ఇది అంతర్జాతీయ మ్యాచ్ కాకపోయిన బ్రాడ్ మాన్ ఊచకోత కారణంగా బాగా ప్రాచుర్యం పొందించింది. ఇలాంటి అనేక అద్భుత ఇన్నింగ్స్ బ్రాడ్ మాన్ ఖాతాలో ఉన్నాయి... కానీ ఇదిమాత్రం చాలా ప్రత్యేకం. ఇప్పటికీ ఈ ఇన్నింగ్స్ గురించి క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటున్నారంటే ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు. 

33
Don Bradman

Don Bradman

ఐపిఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీలు : 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ రికార్డు విండీస్ విధ్వంసకర ప్లేయర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఇతడు  కేవలం 30 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ. గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న సమయంలో ఏప్రిల్ 23, 2013లో పూణే వారియర్స్ (PWI) తో జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు.

ఇక ఐపిఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ యూసఫ్ పఠాన్ ది. అతను కేవలం 37 బంతుల్లో సెంచరీ బాదాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున బరిలోకి దిగి పఠాన్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత మూడో ఫాస్టెస్ట్ సెంచరీ డేవిడ్ మిల్లర్ ది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పై కేవలం 38 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
ప్రపంచం
క్రీడలు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Recommended image2
IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?
Recommended image3
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved