చేయించి మా అమ్మపైకి నెడుతారా: దాడిపై జగన్ భావోద్వేగం

By Nagaraju TFirst Published Nov 17, 2018, 6:44 PM IST
Highlights

 విశాఖ ఎయిర్ పోర్ట్ లో తనపై జరిగిన దాడి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు దిగజారిన ఆరోపణలు చేయించారంటూ వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. కుట్ర చంద్రబాబు చేయించి నింద తన కుటుంబ సభ్యులపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. 

విజయనగరం: విశాఖ ఎయిర్ పోర్ట్ లో తనపై జరిగిన దాడి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు దిగజారిన ఆరోపణలు చేయించారంటూ వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. కుట్ర చంద్రబాబు చేయించి నింద తన కుటుంబ సభ్యులపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. 

హత్య తన అమ్మ,తన చెల్లి చేయించారంటూ ఆరోపించారంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. హత్య కేసులోఒక అమ్మని, ఒక చెల్లిని తెరపైకి తీసుకువచ్చి నిందలు మోపుతారా అంటూ ప్రశ్నించారు. ఈ ఆరోపణ తనను ఎంతగానో బాధించాయన్నారు. ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అంటూ నిలదీశారు. 

జగన్ పై దాడి అతని కుటుంబ సభ్యులే చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను తప్పించేందుకు వైఎస్ విజయమ్మ, లేదా షర్మిలలే దాడి చేయించి ఉంటారని వ్యక్తిగతంగా మాట్లాడారు. అంతేకాదు జగన్ ఫ్యామిలీలో అనేక గొడవలు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపాయి. 

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అటు వైసీపీ, ఇటు జనసేన పార్టీలు గట్టి కౌంటర్ ఇచ్చాయి. చంద్రబాబుపై అలిపిరి దాడి భువనేశ్వరి చేయించారు అంటే ఒప్పుకుంటారా అంటూ టీడీపీని వైసీపీ నిలదీసింది. వ్యాఖ్యలు చేసే ముందు కాస్త విజ్ఞతతో ఆలోచించాలంటూ హితవు పలికింది.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు. తల్లి ఎక్కడైనా కొడుకును చంపుతుందా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ పై దాడిని అంతా ఖండించాలని దాడి వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. 

అంతేకానీ తల్లి హత్య చేయించింది, చెల్లి హత్య చేయించింది అంటూ  వ్యాఖ్యలు చెయ్యడం సబబు కాదన్నారు. వైఎస్ విజయమ్మ, షర్మిలలు తనను తిట్టారని అయినా వారిని ఒక్కమాట కూడా అనలేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను వైఎస్ జగన్ ఖండించారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

 

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్ పై దాడి కేసు.. నేడు హైకోర్టులో విచారణ

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

 శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

 

click me!
Last Updated Nov 17, 2018, 7:10 PM IST
click me!