Russia Ukraine War: రోజురోజుకూ రష్యా సైనికుల దాష్టీకాలు మితిమిరిపోతున్నాయి. శరణార్థులు తలదాచుకున్న.. మేరియుపొల్ నగరంలోనే ఓ థియేటర్‌పై రష్యాన్ సేనలు వైమానిక దాడులకు పాల్పడింది. విచక్షణ రహితంగా బాంబుల వర్షం కురిపించాయి. దాడి సమయంలో వెయ్యి మందికిపైగా తలదాచుకుంటున్నారు. ఇందులో సగానికి పైగా చిన్నారులు, మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.