ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను నిలిపివేయాలని  ఐసీజే ఆదేశించింది. రష్యా మిలటరీ దాడులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ   ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని కోరింది.

హేగ్: Ukraine పై Russia మిలటరీ ఆపరేషన్ ను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయ స్థానం బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

ఉక్రెయిన్ పై దాడిని నిలిపివేయాలని కూడా అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఉక్రెయిన్ లో military operations నిలిపివేయాలని కూడా కోరింది.తన భద్రతా బలగాలను ఉక్రెయిన్ నుండి వెనక్కి తీసుకోవాలని కూడా రష్యాకు ICJతేల్చి చెప్పింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను పాటించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు.రష్యా మిలటరీ ఆపరేషన్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన ఆశరయించింది ఉక్రెయిన్.

రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తన దరఖాస్తును ICJకి సమర్పించింది. దురాక్రమణను సమర్థించేందుకు మారణహోమం భావనను తారుమారు చేసినందుకు రష్యా బాధ్యత వహించాలి. సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని రష్యాను ఆదేశించే అత్యవసర నిర్ణయాన్ని మేము అభ్యర్థిస్తున్నామని zelensky కోరారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 24 వ తేదీన ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ చర్యను ప్రారంభించింది. అయితే రష్యా దళాలను ఉక్రెయిన్ నిలువరిస్తుంది. ఉక్రెయిన్ లోని కీలక నగరాలపై రష్యా క్షిపణులతో దాడులకు దిగుతుంది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవాలని రష్యా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటికే నాలుగు విడతలుగా రెండు దేశాల మధ్య చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ చర్చల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లభించలేదు.

ఎలాగైనా రష్యాకు అడ్డుకట్ట వేయాల‌ని భావిస్తున్న ప‌లు దేశాలు ఆ దేశంపై మ‌రింత క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ప్ర‌పంచంలో ర‌ష్యాను ఒంట‌రిని చేయాల‌ని భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలు, ప‌శ్చిమ దేశాలు ర‌ష్యాపై ఇప్ప‌టికే ప‌లు ఆంక్ష‌లు విధించాయి. 

ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధ ప్ర‌భావం ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌పై ప‌డుతోంది. ఆ క్రమంలోనే ఆ దేశంపై ఆంక్ష‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్ర‌పంచంలో అత్య‌ధిక ఆంక్ష‌లు ఎదుర్కొంటున్న దేశంగా ర‌ష్యా మారింది. ర‌ష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ఆప‌కుండా ఇలాగే ముందుకు సాగితే మ‌రిన్ని కఠిన ఆంక్ష‌లు విధించాల‌ని ప‌లు ప్ర‌పంచ దేశాలు యోచిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్ష‌లు ఎదుర్కొంటున్న దేశంగా మారింద‌ని న్యూయార్క్‌కు చెందిన ఆంక్షల వాచ్‌లిస్ట్ సైట్ పేర్కొంది. ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు ఉక్రేనియన్ తిరుగుబాటు ప్రాంతాలైన డొనెట్స్క్ మరియు లుహాన్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 22న రష్యాపై US మరియు దాని మిత్రదేశాలు మొదట ఆంక్షలు విధించాయని Castellum.AI తెలిపింది.

 ప్ర‌పంచంలోని వంద‌లాది దేశాలు వీటిని అనుస‌రిస్తూ రష్యాపై ఆంక్షలు విధించాయి. ఫిబ్రవరి 22కి ముందు రష్యాపై 2,754 ఆంక్షలు అమల్లో ఉన్నాయని, ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించిన త‌ర్వాత రోజుల్లో 2,778 అదనపు ఆంక్షలు విధించాయి.. దీంతో ర‌ష్యాపై విధించిన మొత్తం ఆంక్ష‌లు 5,532 కు చేరుకున్నాయ‌ని Castellum.AI పేర్కొంది. ఇదిలావుండగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ పై పడింది. చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఆహార ధాన్యాల ధరలు సైతం తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.