ఉక్రెయిన్ దేశంపై రష్యా మిలిటరీ ఆపరేషన్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికా, ఐరోపా దేశాలూ సైనిక చర్యలకు పాల్పడవద్దని రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. లేదంటే కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాయి. ఇన్ని హెచ్చరికలు, ఆర్థిక ఆంక్షలనూ లక్ష్య పెట్టకుండా రష్యా.. ఉక్రెయిన్‌పై ఎందుకు దాడి చేయడానికి పూనుకున్నది. ఉక్రెయిన్ అంటే రష్యాకు ఎందుకు అంత ప్రాధాన్యత? ఉక్రెయిన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం ఏం ఉన్నది?