Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ చర్యలను తీవ్రంగా వ్యతిరేఖించారు జో బిడెన్. రష్యా అధ్యక్షు పుతిన్‌ను ఓ యుద్ధ నేరస్థుడుగా అభివర్ణిస్తారు. ఇంతటికీ రక్తపాతాన్ని సృష్టించిన పుతిన్‌ను యుద్ద నేరస్థుడిగానే పరిగణిస్తానని అన్నారు.
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతూనే ఉంది. దాదాపు మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ మారణాకాండలో ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు ప్రముఖ నగరాలను రష్యా బలగాలు ఆక్రమించాయి. ఇక రాజధాని నగరం కీవ్ ను కూడా స్వాధీనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున్న బలగాలను మోహరించింది రష్యా. ఈ క్రమంలో వేలాది మంది చనిపోయారు. దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ దేశాన్ని వీడి ప్రాణాలు చేతబట్టుకుని ఇతర దేశాలకు తరలిపోయినట్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) అంచనా వేసింది. ఇకనైనా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగే.. శాంతి చర్చల్లో సానుకూల పరిష్కారం లభించాలని పలు దేశాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు మూడు వారాలు గా ఉక్రెయిన్ పై దాడిని కొనసాగిస్తున్న రష్యా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ చర్యలను తీవ్రంగా వ్యతిరేఖించారు జో బిడెన్. బుధవారం వైట్ హౌస్ లో ఓ కార్యక్రమంలో బిడెన్ మీడియాతో మాట్లాడుతూ..పుతిన్‌ను ఓ యుద్ధ నేరస్థుడుగా అభివర్ణిస్తారు. అతని చర్యలను తీవ్ర ఖండించారు. రష్యా దాడి నుండి ఇప్పటి వరకు మూడు మిలియన్ల మంది ప్రజలు ఉక్రెయిన్ నుండి పారిపోయారు. ఉక్రెయిన్‌పై ఇంతటికీ రక్తపాతాన్ని సృష్టించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను యుద్ద నేరస్థుడిగానే పరిగణిస్తానని అన్నారు.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి మాట్లాడుతూ.. ఓ దేశంపై దాడి చేయడం చాలా క్రూరమైన, నియంత, అనాగరిక చర్యలుగా అభివర్ణించారు. ఉక్రెయిన్ లో నెలకొన్న దుర్భర పరిస్థితిని చూస్తుంటే.. హృదయం ద్రవీంచుకపోతుందని అన్నారు. మూడు వారాల క్రితం ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని పుతిన్ ఆదేశించాడు, రష్యా ఉక్రెయిన్ మిలిటరీని బలవంతంగా నిరాయుధీకరణ చేయాలని, పాశ్చాత్య అనుకూల ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుకుందని చెప్పారు. పాశ్చాత్య దేశాల నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు రావడంతో ఉక్రెయిన్ సైన్యం విరోచితంగా తిరిగి పోరాడింది, ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్లో సామాన్యులు మరీ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతి ఒక నిమిషానికి ఓ పౌరుడు.. శరణార్థిగా మారుతున్నాడు. ఇప్పటివరకు మూడు మిలియన్ల ఉక్రేనియన్లు శరణార్థులుగా మారారు.
ఇదిలా ఉంటే.. యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 13, 500 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్ సైనికులు చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యాకు చెందిన 404 ట్యాంకులు, 1279 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది.
మరోవైపు రష్యా దళాలు కీవ్‌లో భీకరపోరును సాగిస్తున్నాయి. రష్యా బాంబుల దాడిని మరింత ఉద్ధృతం చేసింది. రష్యన్ క్షిపణులు జనావాసాలపై పడుతున్నాయి కీవ్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. పలు ఇతర నగరాల్లో కూడా రష్యా బలగాలు దాడులు కొనసాగాయి.
ఉక్రెయిన్ గగనతలం మీద నో-ఫ్లయ్ జోన్ అమలు చేయాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ అభ్యర్థనను తొసిపుచ్చింది. దీంతో నాటోపై అసంతృప్తి వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. కొందరు దేశాధినేతలు రష్యాకు హిప్నటైజ్ అయ్యారని వ్యాఖ్యానించారు. నాటో కూటమిలో చేరబోమని మరోసారి స్పష్టం చేశారు జెలెన్‌స్కీ.. ఈ వాస్తవాన్ని ప్రజలంతా అంగీకరించాలని కోరారు.
