ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే వుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా యుద్ధంలో విజయం సాధించాలని రష్యా అధినేత పుతిన్ గట్టి పట్టుదలగా వున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌కు అంతర్జాతీయంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు భారీగా నిధులు అందుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సంతతికి చెందిన బిలియనీర్ మహ్మద్ జహూర్ ఉక్రెయిన్ సైన్యం కోసం రెండు యుద్ధ విమానాలను కొనుగోలు చేశారు.