Russia Ukraine War: ర‌ష్యాకు జపాన్ మ‌రో సారి షాక్ ఇచ్చింది. మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యాకు త‌మ దేశం కల్పించిన 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' వాణిజ్య హోదాను రద్దు చేసింది. ఈ మేర‌కు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రష్యాకు లగ్జరీ ప్రోడక్ట్‌ల సరఫరాను, ఎంపిక చేసిన రష్యా వస్తువుల దిగుమతిని నిలిపివేస్తున్నట్టు తెలిపారు. 

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతూనే ఉంది. దాదాపు మూడు వారాలు కొన‌సాగిస్తున్నా ఈ మార‌ణాకాండ‌లో .. ఇప్ప‌టికే ఉక్రెయిన్ లోని ప‌లు ప్ర‌ముఖ న‌గ‌రాల‌ను ర‌ష్యా బ‌ల‌గాలు ఆక్ర‌మించాయి. ఇక రాజ‌ధాని న‌గ‌రం కీవ్ ను కూడా స్వాధీనం చేసుకోవ‌డానికి పెద్ద ఎత్తున్న బ‌ల‌గాల‌ను మోహ‌రించింది ర‌ష్యా. ఈ క్ర‌మంలో వేలాది మంది చ‌నిపోయారు. దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ దేశాన్ని వీడి ప్రాణాలు చేతబట్టుకుని ఇతర దేశాలకు తరలిపోయినట్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) అంచనా వేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో సానుకూల పరిష్కారం లభించాలని పలు దేశాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.

మ‌రోవైపు..ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేస్తు్న్న దండ‌యాత్రను వ్య‌తిరేకిస్తూ.. దురాక్రమణ సాగిస్తున్న రష్యాపై ఆంక్ష‌లు విధిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌పాన్ కూడా భారీ షాక్ ఇచ్చింది. తాజాగా ర‌ష్యాపై జపాన్ మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యాకు తాము కల్పించిన 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' వాణిజ్య హోదాను రద్దు చేస్తున్నట్టు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బుధవారంనాడు ప్రకటించారు. రష్యాకు లగ్జరీ ప్రోడక్ట్‌ల సరఫరాను, ఎంపిక చేసిన రష్యా వస్తువుల దిగుమతిని నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఐఎంఎఫ్‌తో సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రష్యాకు రుణాలు లభించకుండా అడ్డుకునేందుకు జపాన్ తమ వంతు ప్రయత్నాలను చేస్తుందని ప్ర‌క‌టించారు.

అమెరికాకు కృతజ్ఞతలు చెబుతూనే మరింత సాయం కోరిన జెలెన్‌స్కీకాగా, ఇప్పటికే ర‌ష్యాపై జపాన్ పలు ఆంక్షలను విధించింది. అలాగే.. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉన్నతాధికారులు, అత‌ని స్నేహితులు. స‌న్నిహితంగా ఉంటే బిలియనీర్ల ఆస్తులు, బ్యాంకు ఖాతాల‌ను నిలిపివేసింది.మరోవైపు, ఉక్రయెన్‌ నుంచి పొరుగుదేశాలకు పారిపోతున్న ప్రజల కోసం మానవతా సాయాన్ని మరింత పెంచుతున్నట్టు. మందులు, సహాయ సామగ్రి వంటి మానవతాసాయాన్ని నౌకల ద్వారా ఉక్రెయిన్‌కు జపాన్ పంపుతోంది.

ఇదిలా ఉంటే.. యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 13, 500 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్ సైనికులు చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది. ర‌ష్యాకు చెందిన 404 ట్యాంకులు, 1279 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్ర‌క‌టించింది. 

మరోవైపు ర‌ష్యా ద‌ళాలు కీవ్‌లో భీకరపోరును సాగిస్తున్నాయి. రష్యా బాంబుల దాడిని మరింత ఉద్ధృతం చేసింది. రష్యన్‌ క్షిపణులు జనావాసాలపై పడుతున్నాయి కీవ్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. పలు ఇతర నగరాల్లో కూడా రష్యా బలగాలు దాడులు కొనసాగాయి.

ఉక్రెయిన్‌ గగనతలం మీద నో-ఫ్లయ్‌ జోన్‌ అమలు చేయాల‌ని అధ్యక్షుడు జెలెన్ స్కీ అభ్య‌ర్థ‌న‌ను తొసిపుచ్చింది. దీంతో నాటోపై అసంతృప్తి వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. కొందరు దేశాధినేతలు రష్యాకు హిప్నటైజ్‌ అయ్యారని వ్యాఖ్యానించారు. నాటో కూటమిలో చేరబోమని మరోసారి స్పష్టం చేశారు జెలెన్‌స్కీ.. ఈ వాస్తవాన్ని ప్రజలంతా అంగీకరించాలని కోరారు.