Russia Ukraine War: ఉక్రెయిన్ - రష్యాల మధ్య గత నెల రోజులు యుద్దం కొనసాగుతోంది. ఈ యుద్దంలో 1,351 మంది రష్యా సైనికులు మరణించారని రష్యా తెలిపింది. అదే సమయలో 3,825 మంది సైనికులు గాయపడ్డారని ప్రకటించింది. రష్యా సైనిక చర్యల వల్ల దాదాపు 4 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులను స్వదేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్లిపోయారని వెల్లడించింది.