భారత్లో గత 15 రోజుల నుంచి యూకే, చైనా, ఆస్ట్రియా, గ్రీస్, మెక్సిల విదేశాంగ మంత్రులు వచ్చారు. ఇటీవలే అమెరికా డిప్యూటీ ఎన్ఎస్ఏ దలీప్ సింగ్ కూడా పర్యటించారు. కానీ, వీరెవ్వరితోనూ ప్రధాని మోడీ సమావేశం కాలేదు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అడిగి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్తో మోడీ సమావేశం కావడంతో ప్రపంచ దేశాలకు ఒక బలమైన సంకేతం వెళ్లింది.